India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పూర్తైనట్లు డీఎంహెచ్‌ఓ డా.రామారావు తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు 2.55 లక్షల ఇళ్లలో పరీక్షలు నిర్వహించగా 1,369 మంది అనుమానితులను గుర్తించారు. తుది పరీక్షల అనంతరం 5 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. వారికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.

నవంబర్ నెలకు సంబంధించి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారుల ర్యాంకులను సంస్థ ప్రకటించింది. అర్బన్ విభాగంలో ఏడీఈ నాగార్జున, ఏఈ తిరుపయ్య, రూరల్ విభాగంలో ఏఈ అనిల్ కుమార్ ర్యాంకులు సాధించారు. సర్కిల్ స్థాయిలో డీఈ రాములు, ఏడీఈ యాదగిరి, రామారావు, ఏఈ రవికుమార్, అబ్దుల్ ఆసీఫ్ ప్రతిభ కనబరిచారు. విధి నిర్వహణలో ప్రతిభ చాటిన అధికారులను పలువురు అభినందించారు.

సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని,పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించబోమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. భూత్పూర్‌లో నూతన సర్పంచుల సన్మాన ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులు, ఇతర సభ్యులు,స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకివచ్చే అందరూ సమిష్టిగాఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన కోరారు.

HAPPY NEW YEAR అని వాట్సాప్‌లో ఫొటో వచ్చిందా? జాగ్రత్త. ఈ ఫొటోలో బైనరీ కోడ్ ఉండొచ్చు. దాన్ని డౌన్‌లోడ్ చేస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి పర్సనల్ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. దీన్నే డిజిటల్ స్టినోగ్రఫీ స్కామ్ అంటారని నగర పోలీసులు చెబుతున్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు అన్నీ వాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి. కొత్త నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తే అస్సలు డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని స్థానిక మయూరి ఎకో పార్క్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పార్క్ లో రుసుముతో కూడిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకున్న వారు స్థానిక పార్క్ లో సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నూతన సంవత్సర స్వాగత సంబరాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కేకు కోసి నగర పోలీస్ అధికారులకు తినిపించారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో భార్య నాగరాణిను హత్య చేసిన భర్త ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2021 ఆగస్టు 27న దంపతుల మధ్య గొడవ జరగగా భార్యను భర్త కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జైలు శిక్ష విధించినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.

మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పథకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌కు ఉత్తమ సేవ పథకం, ఎస్ఐ విఠల్‌కు సేవ పథకం, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగంకు సేవ పథకం ప్రకటించారు. ఎంపికైన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు 30, 30 ఏ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అనుమతి లేనిది ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు 30, 30 ఏ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అనుమతి లేనిది ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.