Telangana

News May 11, 2024

నల్గొండలో గెలుపెవరిది..?

image

నల్గొండ లోక్ సభ సమరం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడి, బీజేపీ తరఫున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. సూర్యాపేట మినహా ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ నుంచే ఉండడంతో భారీ మెజార్టీ సాధించాలని హస్తం పార్టీ, ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్, మోదీ చరిష్మాతో సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నాయి. మరి విజయం ఎవరిది..?

News May 11, 2024

ఉమ్మడి జిల్లా MP అభ్యర్థులు ఓటు వేసేది ఇక్కడే

image

వంశీచంద్ రెడ్డి(INC) NGKL నుంచి పద్మావతి కాలనీ(MBNR)లోని 113 నంబర్ పోలింగ్ బూత్ కు,DK అరుణ(BJP)GDWL నుంచి టీచర్స్ కాలనీ(MBNR) బ్రిలియంట్ స్కూల్లో 113 పోలింగ్ బూతుకు, మల్లు రవి(INC) ఖైరతాబాద్ బూత్ నంబరు 157లో, మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) నవాబుపేట(మ) గురుకుంటలోని 22వ పోలింగ్ బూత్‌లో,RS ప్రవీణ్ కుమార్(BRS)సిర్పూర్ నుంచి అలంపూర్ బూత్ నంబర్ 272లో, భరత్ ప్రసాద్(BJP) చంపాపేట్(HYD)లో ఓటు వెయ్యనున్నారు.

News May 11, 2024

కరీంనగర్: 29 ఏళ్లలోపు ఓటర్లు 23.50 శాతం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 29.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14.51 లక్షల మంది పురుషులు, 15.26 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల లోపు యువత 7,00,201 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 23.50 శాతం యువతీ యువకులే. 18-19 ఏళ్లలోపు 82,100 ఓటర్లు ఉన్నారు. 20-29 ఏళ్ల లోపు 6,18,101 ఓటర్లు ఉన్నారు.

News May 11, 2024

నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెర..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News May 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔’నేడు పెబ్బేరుకు ఉప ముఖ్యమంత్రి భట్టి రాక’
✔నేడు పాలమూరుకు బిజెపి బైక్ ర్యాలీ
✔నేడు వనపర్తికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
✔నేటితో ముగియనున్న ఎంపీ ఎన్నికల ప్రచారం
✔బాదేపల్లి మార్కెట్ నేడు బంద్
✔డబ్బు,మద్యం పంపిణీపై అధికారుల ఫోకస్
✔సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
✔MP ఎన్నికల EFFECT..సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారలపై నిఘా
✔పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటుపై అధికారుల దృష్టి

News May 11, 2024

మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణించిన బాలుడు పెద్దవంగర మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన చింతం జస్వంత్‌గా గుర్తించారు.

News May 11, 2024

REWIND.. ఖమ్మం నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు

image

ఖమ్మం లోక్ సభకు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 11 సార్లు గెలిచింది. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. కాంగ్రెస్ నుంచి లక్ష్మీ కాంతమ్మ హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి గెలిచిన జలగం వెంగళరావు, పీవీ రంగయ్యనాయుడు, రేణుకాచౌదరి కేంద్ర మంత్రి పదువులు చేపట్టారు. సిట్టింగ్ ఎంపీ నామా బీఆర్ఎస్, టీడీపీ నుంచి ఒక్కోసారి ఎంపీగా ఉన్నారు.

News May 11, 2024

మెదక్: మరికొన్ని గంటల్లో మూగబోనున్న మైకులు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సా.6 గం.కు మైకులు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత 57 రోజుల నుండి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన BRS, కాంగ్రెస్, బిజెపి పార్టీల ముఖ్య నేతలు మెదక్ గడ్డపై తమ పార్టీ జెండా ఎగర వెయ్యాలని ప్రచారం నిర్వహించారు. మరోవైపు సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది.

News May 11, 2024

NZB జిల్లాలో 3 రోజులు మద్యం షాపులు బంద్

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 13 వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు.

News May 11, 2024

ఆదిలాబాద్: ఇంకా మరి కొన్ని గంటలే..!

image

పోలింగ్ సమయం సమయం సమీపిస్తుండటం, మరికొన్ని గంటల్లో ప్రచారానికి బ్రేక్ పడనుండటంతో పార్టీల నేతలు దూకుడు పెంచారు. అగ్రనేతలు మొదలుకుని ముఖ్య నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుంది.