Telangana

News May 11, 2024

ఆదిలాబాద్: ఇంకా మరి కొన్ని గంటలే..!

image

పోలింగ్ సమయం సమయం సమీపిస్తుండటం, మరికొన్ని గంటల్లో ప్రచారానికి బ్రేక్ పడనుండటంతో పార్టీల నేతలు దూకుడు పెంచారు. అగ్రనేతలు మొదలుకుని ముఖ్య నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుంది.

News May 11, 2024

ADB: ఆదర్శ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

image

అదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడ ఆదర్శ కళాశాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్ (2024-25) లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు
ఉమ్మడి జిల్లా కన్వీనర్ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రతిని తగిన ధ్రువపత్రాలతో కళాశాలలో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News May 11, 2024

వరంగల్: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు

image

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఇన్ని రోజులుగా పాటలతో, మాటలతో హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు మరో 48 గంటల సమయమే మిగిలి ఉండటంతో, అటు మద్యం దుకాణాలు సైతం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మూతపడనున్నాయి. ప్రచార పర్వం ముగుస్తుండటంతో అటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వం మొదలు కానుంది.

News May 11, 2024

HYD: ఇంటర్ ఫెయిల్.. యువతి అదృశ్యం

image

ఇంటర్ ఫెయిల్ కావడంతో ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం మల్కాజిగిరిలోని రామకృష్ణాపురంలో నివాసం ఉంటుంది. వారి కుమార్తె (19) ఈనెల 9న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇంట్లో తల్లికి కుమార్తె రాసిన లేఖ లభించింది. ఇంటర్‌లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. శుక్రవారం తల్లి ఫిర్యాదుతో నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 11, 2024

HYD: ఇంటర్ ఫెయిల్.. యువతి అదృశ్యం

image

ఇంటర్ ఫెయిల్ కావడంతో ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం మల్కాజిగిరిలోని రామకృష్ణాపురంలో నివాసం ఉంటుంది. వారి కుమార్తె (19) ఈనెల 9న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇంట్లో తల్లికి కుమార్తె రాసిన లేఖ లభించింది. ఇంటర్‌లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. శుక్రవారం తల్లి ఫిర్యాదుతో నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 11, 2024

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థికి నోటీసులు

image

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఘటనలో పెద్దపల్లి BRS MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామంలో ఈ నెల 6న పార్టీ కండువాలు ధరించి ప్రచారం చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

News May 11, 2024

HYD: MP ఎన్నికలు.. నేటితో ప్రచారానికి తెర!!

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు పాలమూరును వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని రోజులుగా మైకులతో హోరెత్తిన పట్టణాలు, గ్రామాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొననుంది.

News May 11, 2024

NZB: హోటల్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

image

హోటల్ ముసుగులో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని HYD పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద 11.34గ్రా కొకైన్, 3.66గ్రా MDMA స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు. NZBకి చెందిన సాయి శరత్, శ్రవణ్ అన్నదమ్ములు. వారిద్దరూ 2019లో బంజారాహిల్స్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. శరత్ ప్రేమలో విఫలం కావడంతో డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో రిషబ్‌తో పరిచయం కాగా ముగ్గురు కలిసి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు.

News May 11, 2024

100 శాతం భద్రత చర్యలు: సైబరాబాద్ సీపీ

image

లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100% భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సీపీ అవినాష్ మహంతి అన్నారు. పోలింగ్ రోజు కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందన్నారు. అక్రమ నగదు, మద్యం ఉచిత స్వాధీనాల్లో సైబరాబాద్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. మొత్తం 6 వేల మంది పోలీసులు, 13 కంపెనీల కేంద్ర బలగాలు, 850 మంది శిక్షణ కానిస్టేబుళ్లు, SIలు విధుల్లో ఉంటారన్నారు.

News May 11, 2024

సూర్యాపేట: నకిలీ బంగారంతో రూ.56 లక్షలు రుణం

image

నకిలీ బంగారంతో ఓ వ్యక్తి బ్యాంకును బురిడీ కొట్టించాడు. బ్యాంకు అధికారుల వివరాలిలా.. నేరేడుచర్ల మండలం వైకుంటపురం గ్రామానికి చెందిన రాజేశ్ 2023 మేలో గరిడేపల్లి మండలంలో రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారం కుదువ పెట్టి రూ.56 లక్షల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో ఉన్నతాధికారులు ఆడిట్ చేశారు. ఆ బంగారం నకిలీదని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.