Telangana

News May 11, 2024

100 శాతం భద్రత చర్యలు: సైబరాబాద్ సీపీ

image

లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100% భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సీపీ అవినాష్ మహంతి అన్నారు. పోలింగ్ రోజు కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందన్నారు. అక్రమ నగదు, మద్యం ఉచిత స్వాధీనాల్లో సైబరాబాద్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. మొత్తం 6 వేల మంది పోలీసులు, 13 కంపెనీల కేంద్ర బలగాలు, 850 మంది శిక్షణ కానిస్టేబుళ్లు, SIలు విధుల్లో ఉంటారన్నారు.

News May 11, 2024

సూర్యాపేట: నకిలీ బంగారంతో రూ.56 లక్షలు రుణం

image

నకిలీ బంగారంతో ఓ వ్యక్తి బ్యాంకును బురిడీ కొట్టించాడు. బ్యాంకు అధికారుల వివరాలిలా.. నేరేడుచర్ల మండలం వైకుంటపురం గ్రామానికి చెందిన రాజేశ్ 2023 మేలో గరిడేపల్లి మండలంలో రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారం కుదువ పెట్టి రూ.56 లక్షల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో ఉన్నతాధికారులు ఆడిట్ చేశారు. ఆ బంగారం నకిలీదని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 11, 2024

బిజినేపల్లి: భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

image

అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలైన ఘటన బిజినేపల్లి మండలం మంగనూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. సంఘనమోని వెంకటయ్య రెండో భార్య తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెద్దల సమక్షంలో పలుమార్లు విన్నవించిన తీరు మారకపోవడంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య(45) తారకమ్మ(34)ను నిద్రిస్తుండగా తలపై బండ రాయితో కొట్టి హత్యచేశాడు. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 11, 2024

పోలింగ్ ముగిసేవరకు వైన్స్ బంద్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 11న సాయంత్రం నుంచి 13వ తేదీన పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ ఉంటాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శెగ్గెం సైదులు తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా మద్యం విక్రయించినట్లు, రవాణా చేసినట్లు తెలిస్తే 87126 58939 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 581 కేసులు నమోదు చేసి 57 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.

News May 11, 2024

సుల్తానాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

బావిలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్‌లో జరిగింది. ఎస్ఐ, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవ్ నగర్‌కు చెందిన చింతల రాజు(20) గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఓ వ్యవసాయ బావి వద్ద తన బైక్, చెప్పులు గమనించారు. కొడుకు మృతిపట్ల అనుమానాలు ఉన్నట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 11, 2024

NRPT: మోదీ సభతో బీజేపీలో శ్రేణుల్లో జోష్

image

నారాయణపేటలో శుక్రవారం జరిగిన బీజేపీ జనసభ, బీజేపీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ప్రధాని మొదటిసారిగా జిల్లాకు రావడంతో సర్వత్రా ఉత్సాహం వెల్లివిరిసింది. మోదీ ప్రసంగానికి యువత, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రధాని రాకకు ముందే ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. మోదీ ప్రసంగం ముగిసేంతవరకు మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది.

News May 11, 2024

వరంగల్: గుండెపోటుతో యువకుడి మృతి

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలంలోని రావూరు గ్రామానికి చెందిన నాగరాజు(28) గుండెపోటుతో మృతి చెందాడు. అయితే రోజు వారీలాగే ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లొచ్చాడు. సాయంత్రం 9 నుంచి 10 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించాడు.

News May 11, 2024

ADB: 16 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

image

పార్లమెంట్ ఎన్నికల విధులకు సంబందించి ఈ నెల 1 నుంచి 3 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెండో విడుత శిక్షణకు గైర్హాజరైన 16 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంతా నోటిసులు అందిన 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాద్యాయులు ఇచ్చే సంజాయిషి ఆధారంగా తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 11, 2024

MP ఎన్నికలు.. నేటితో ప్రచారానికి తెర.!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సా. 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు పాలమూరును వదిలి వెళ్లాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 31 మంది, నాగర్ కర్నూల్ పరిధిలో 19 మంది బరిలో ఉన్నారు. ఇన్ని రోజులుగా మైకులతో హోరెత్తిన పట్టణాలు, గ్రామాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొననుంది.

News May 11, 2024

ఇప్పటివరకు రూ.2కోట్లకు పైగా నగదు సీజ్

image

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని లాడ్జీలు, హాటళ్లలో పోలీసులు సోదాలు చేస్తూ అపరిచిత వ్యక్తులు ఉంటే ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు రూ.2కోట్లకు పైగా నగదును సీజ్ చేయగా, పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త తనిఖీల్లో రూ.కోటి పైగా విలువైన మద్యం, రూ.20లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే, చివరి 2 రోజులు మరింత కీలకం కావడంతో తనిఖీలు ముమ్మరం చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది.