Telangana

News May 10, 2024

నేను బ్రతక లేక రాజకీయాలు చేయట్లేదు: కందాళ

image

నేను బ్రతక లేక రాజకీయాలు చేయట్లేదు.. ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలనే రాజకీయాలు చేస్తున్నాను.. అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సాయి గణేష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.

News May 10, 2024

మక్తల్‌‌కు చేరుకున్న సీఎం రేవంత్

image

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జన జాతర సభకు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

News May 10, 2024

జోగులాంబ అమ్మవారికి నా ప్రణామములు: ప్రధాని మోదీ

image

పాలమూరులో ఎన్నో వనరులున్నా.. ఇక్కడి జనం వలస పోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘జోగులాంబ అమ్మవారికి నా ప్రణామాలు. గత పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్లలో తెలంగాణకు పంపిన లక్షల కోట్లు ఎటు పోయాయి? పదేళ్లలో BRS, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను లూటీ చేస్తోంది. కాళేశ్వరం విచారణకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదు’ అని నారాయణపేట బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యానించారు.

News May 10, 2024

ములుగు: ఎన్నికలను బహిష్కరించాలని వాల్ పోస్టర్లు

image

ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వాజేడు మండలం జగన్నాథపురంలోని వై-జంక్షన్ వద్ద మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలిశాయి. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని, హిందుత్వ ఫాసిస్టు బీజేపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న ఇతర పార్టీలను తరిమికొట్టాలని వెంకటాపురం-వాజేడు ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. ఈ వాల్ పోస్టర్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

News May 10, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి… అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది, మహబూబ్నగర్ కొత్తపల్లిలో 40.0, వనపర్తి జిల్లా పానగల్లో 39.9, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 39.7, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 39.3 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 10, 2024

HYD శివారులో విషాదం.. బాలుడి మృతి

image

HYD శివారు మొయినాబాద్ సుజాత స్కూల్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. 2వ తరగతి చదువుతోన్న విద్యార్థి శివశౌర్య సమ్మర్ క్యాంపులో భాగంగా స్విమ్మింగ్ ఫూల్‌లో శిక్షణ తీసుకొంటున్నారు. ఈత కొట్టేందుకు నీళ్లలో దిగి దుర్మరణం చెందారు. విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసిందని తల్లిదండ్రులు స్కూల్ ట్రైనర్‌కు దేహశుద్ధి చేశారు. మృతి చెందిన బాలుడు మొయినాబాద్ మం. సురంగల్‌కి చెందినట్లు సమాచారం.

News May 10, 2024

ADB: పోలీసులకు అవగాహన కల్పించిన SP

image

జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించనున్న నూతన శిక్షణ కానిస్టేబుల్ కేంద్ర బలగాలకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్‌ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమికూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతి లేదని ఓటర్లకు చెప్పాలన్నారు.

News May 10, 2024

వరంగల్: బాధితురాలి ఆత్మహత్యాయత్నం

image

ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు తెలియకుండానే గర్భసంచి తొలగించారని ఇటీవల ఓ మహిళ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సదరు మహిళ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం నిద్రమాత్రలు మింగింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు.

News May 10, 2024

KMR: రేపే లాస్ట్.. అగ్రనేతల రాకతో వేడెక్కిన పాలిటిక్స్..!

image

లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలను రంగంలోకి దింపుతు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ KMR జిల్లాలో బీజేపీ MLA రాజాసింగ్ బీబీ పాటిల్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సురేష్ షెట్కార్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి రేపు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డి కామారెడ్డి కు రానున్నారు.

News May 10, 2024

17 సార్లు ఎన్నికలు.. నామాదే అత్యధిక మెజార్టీ

image

ఖమ్మం MP స్థానంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.