Telangana

News May 10, 2024

HYD శివారులో విషాదం.. బాలుడి మృతి

image

HYD శివారు మొయినాబాద్ సుజాత స్కూల్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. 2వ తరగతి చదువుతోన్న విద్యార్థి శివశౌర్య సమ్మర్ క్యాంపులో భాగంగా స్విమ్మింగ్ ఫూల్‌లో శిక్షణ తీసుకొంటున్నారు. ఈత కొట్టేందుకు నీళ్లలో దిగి దుర్మరణం చెందారు. విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసిందని తల్లిదండ్రులు స్కూల్ ట్రైనర్‌కు దేహశుద్ధి చేశారు. మృతి చెందిన బాలుడు మొయినాబాద్ మం. సురంగల్‌కి చెందినట్లు సమాచారం.

News May 10, 2024

ADB: పోలీసులకు అవగాహన కల్పించిన SP

image

జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించనున్న నూతన శిక్షణ కానిస్టేబుల్ కేంద్ర బలగాలకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్‌ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమికూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతి లేదని ఓటర్లకు చెప్పాలన్నారు.

News May 10, 2024

వరంగల్: బాధితురాలి ఆత్మహత్యాయత్నం

image

ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు తెలియకుండానే గర్భసంచి తొలగించారని ఇటీవల ఓ మహిళ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సదరు మహిళ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం నిద్రమాత్రలు మింగింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు.

News May 10, 2024

KMR: రేపే లాస్ట్.. అగ్రనేతల రాకతో వేడెక్కిన పాలిటిక్స్..!

image

లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలను రంగంలోకి దింపుతు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ KMR జిల్లాలో బీజేపీ MLA రాజాసింగ్ బీబీ పాటిల్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సురేష్ షెట్కార్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి రేపు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డి కామారెడ్డి కు రానున్నారు.

News May 10, 2024

17 సార్లు ఎన్నికలు.. నామాదే అత్యధిక మెజార్టీ

image

ఖమ్మం MP స్థానంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.

News May 10, 2024

ఆదిలాబాద్: బీఆర్ఎస్ ప్రచార రథం బోల్తా.. తప్పిన ప్రమాదం

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడి తలకిందులు అయింది. బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార నిమిత్తం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడి తలకిందులు అయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

News May 10, 2024

మేనత్తను అవమానిస్తే నవ్వులు చిందిస్తారా..?: DK అరుణ

image

కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మహబూబ్ నగర్ MP అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరి మాటలను ఖండించాల్సిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నవ్వులు చిందించడం విస్మయం కలిగించిందన్నారు.

News May 10, 2024

RR: పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ!

image

పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు ఉంది. చేవెళ్ల BRS నుంచి పోటీ చేస్తున్న కాసానికి జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఓటు హక్కు ఉంది. దీంతో వారికి వారు ఓటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

News May 10, 2024

RR: పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ!

image

పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు ఉంది. చేవెళ్ల BRS నుంచి పోటీ చేస్తున్న కాసానికి జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఓటు హక్కు ఉంది. దీంతో వారికి వారు ఓటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

News May 10, 2024

MBNR: ఓటేసి మనమేంటో చూపిద్దాం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL పార్లమెంట్ నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా అధికారులు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటేసి మనమేంటో చూపిద్దాం. మే 13న తరలిరండి అంటూ అధికారులు పిలుపునిచ్చారు.