India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.

కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20 క్రికెట్ లీగ్ టోర్నీలో NZB జట్టు HYDపై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన NZB జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన HYD జట్టు 9 వికెట్లను కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో NZB జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఎస్పీ డి.జానకి మంగళవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు.

రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ శిక్షణలో మాట్లాడుతూ.. సాంకేతికతతో పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 3 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మెండోరా మండలం పోచంపాడ్ సమీపంలో తెలంగాణ సొషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో టీచర్‌గా పని చేస్తున్న ప్రియాంక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందినట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు. బైక్ మీద వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టిందన్నారు. చికిత్స నిమిత్తం నిర్మల్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారన్నారు

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపేందుకు ‘ఆపరేషన్ స్మైల్-11’ సిద్ధమైంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇటుక బట్టీలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరీలో ఉన్న చిన్నారులను రక్షిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేట్ 4 శాతం తగ్గిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వార్షిక క్రైమ్ నివేదికను వివరించారు. మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసులు స్వల్పంగా పెరిగాయన్నారు. జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించామన్నారు. సైబర్ క్రైమ్‌లు పెరిగినట్లు చెప్పారు.

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్‌కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న సర్కారు హామీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చాలామంది రైతుల ఖాతాల్లో నేటికీ నగదు జమకాలేదు. మరోవైపు ‘రైతు భరోసా’ ఊసే లేకపోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. అప్పులు తీరక, కొత్త సాగుకు సాయం అందక రైతులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకొని రావద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా శీతాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చలి నుంచి రక్షణ పొందే దుప్పట్లు అందజేయాలన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బొకేలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమన్నారు.
Sorry, no posts matched your criteria.