Telangana

News May 10, 2024

మహాముత్తారం: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహాముత్తారం కాంగ్రెస్ మండల <<13216465>>అధ్యక్షురాలు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మహాముత్తారంలో కీర్తిబాయి(45) ప్రచారం నిర్వహించారు. అనంతరం పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్తతో కలిసి కారులో వెళ్తుండగా నిమ్మగూడెం వద్ద కారు అదుపుతప్పి మట్టి కుప్పను ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు.

News May 10, 2024

KMM: మత్తు మందు స్ప్రే చేసి బంగారు గాజుల అపహరణ

image

ఒంటరిగా మహిళ ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి బంగారు గాజుల అపహరించిన ఘటన తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడకు చెందిన మహిళ రాధిక ఇంట్లో ఒంటరిగా కూర్చోని ఉండగా ఇంటి వెనుక వైపు నుంచి గుర్తు తెలియని దొంగ లోపలకు ప్రవేశించి రాధిక మొఖంపై మత్తు మందు స్ప్రే చేశాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో చేతికి ఉన్న రూ.1.05 లక్షల విలువైన 3 బంగారు గాజులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.

News May 10, 2024

మాచారెడ్డి: ఉరేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచారెడ్డి మండలం తండాలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లావుడ్య నవీన్ (21) కొద్దిరోజులుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటోలు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పులు కూడా పుట్టకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

News May 10, 2024

MNCL: రైలు కింద పడి సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన ఊరుగొండ సాయికుమార్ అనే సింగరేణి కార్మికుడు గురువారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 20న ఉద్యోగంలో చేరిన సాయికుమార్ గనిలో దిగాలంటే భయంగా ఉందని, ఉద్యోగం చేయలేనంటూనే వాడు. ఈ క్రమంలో గురువారం డ్యూటీకి వెళ్లిన సాయికుమార్ రైలు పట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

News May 10, 2024

స్వల్పంగా పెరుగుతున్న మిర్చి, పత్తి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. పత్తి జండా పాట క్వింటా రూ.7125, ఏసీ మిర్చి క్వింటా జండా పాట రూ.21100, నాన్ ఏసీ మిర్చి జండా పాట క్వింటా రూ.18 వేలు ధర పలికినట్లు వెల్లడించారు. ధరలు స్వల్పంగా పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి నిన్నటి కంటే రూ.25 పెరగగా, ఏసీ మిర్చి 600 పెరిగింది. నాన్ ఏసీ మిర్చి ధర నిలకడగా ఉంది.

News May 10, 2024

పానగల్: గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి

image

పానగల్ మండలం కేతేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ రెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. వనపర్తి టీచర్స్ కాలనీలోని స్వగృహంలో తెల్లవారుజామున బాత్రూంకి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయి మరణించినట్లు మృతుని బంధువులు తెలిపారు. ఆయన భార్య ప్రభుత్వ టీచరే. కిరణ్ మరణంతో కేతేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 10, 2024

KMM: ఫోన్ కాల్స్ ద్వారా ఓట్ల అభ్యర్థన

image

ఖమ్మం లోక్ సభ స్థానంలో 16,31,039 మంది, మహబూబాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో 15,30,367 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరినీ ప్రత్యక్షంగా కలవటం సాధ్యం కాకపోవటంతో ఎంపీ అభ్యర్థుల వాయిస్‌తో ఫోన్ కాల్స్ ద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే మీకూ కాల్స్ వస్తున్నాయా.. కామెంట్ చేయండి.

News May 10, 2024

KMM: రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

image

లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు చివరి ఘట్టానికి చేరుకుంది. ఖమ్మం జిల్లా పరిధిలోని 5అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు, భద్రాద్రి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకే ముగియనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు సాగిస్తూనే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

News May 10, 2024

MBNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

image

MBNR పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈనెల 13న ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మూత్రశాలలు, షామీయానాలు, తాగునీరు, ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పారామెడికల్ సిబ్బంది సేవలు అందుబాటులో ఉంచనున్నారు.

News May 10, 2024

11న సాయంత్రం నుంచి HYD, రాచకొండలో ఆంక్షలు

image

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం, ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ HYD, రాచకొండ పోలీసు కమిషనర్లు గురువారం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పోలింగ్ రోజైన 13న ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.