Telangana

News May 10, 2024

LB నగర్: పెళ్లి పేరుతో మోసం.. యువకుడికి రిమాండ్

image

ప్రేమ పెళ్లి అంటూ యువతిని లోబర్చుకుని మోసం చేసిన ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన యువతి, నల్గొండ జిల్లాకు చెందిన మధు చైతన్యపురిలో కోచింగ్ తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించాడు.దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News May 10, 2024

హుజూరాబాద్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

image

ఓటర్లను ప్రభావితం చేసేందుకు బుధవారం రాత్రి హుజూరాబాద్ క్లబ్‌లో విందు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, పర్యాటకాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్, బండ శ్రీనివాస్, క్లబ్ నిర్వాహకుడు రవీందర్ రావు, బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బొల్లం రమేశ్ గురువారం తెలిపారు.

News May 10, 2024

వరంగల్: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహాముత్తారం కాంగ్రెస్ మండల <<13216465>>అధ్యక్షురాలు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మహాముత్తారంలో కీర్తిబాయి(45) ప్రచారం నిర్వహించారు. అనంతరం పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్తతో కలిసి కారులో వెళ్తుండగా నిమ్మగూడెం వద్ద కారు అదుపుతప్పి మట్టి కుప్పను ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు.

News May 10, 2024

మారుతున్న వ్యూహాలు.. వలస ఓటర్లపై ఫోకస్

image

లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న కొద్ది నాయకులు ప్రచార వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం లెక్కలను పరిగణలోకి తీసుకుని పక్కా వ్యూహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలుపు అంచనాతో మద్దతు కూడగట్టేందుకు ఆయా పార్టీల నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీలు నువ్వా..నేనా.. అన్నట్లు వలస ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

News May 10, 2024

కామారెడ్డిలో చెల్లని కేసీఆర్‌.. రాష్ట్రానికి ఎలా చెల్లుతారు: రఘునందన్‌

image

దేశానికి ప్రధాని మోదీయే శ్రీరామరక్ష అని, దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో తాను చెల్లని రూపాయిని అయితే కామారెడ్డిలో చెల్లని మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. దుబ్బాక అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. మీరు చేసే ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

News May 10, 2024

నిర్మల్: సెల్‌ఫోన్‌కి బానిసై తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్

image

సెల్‌ఫోన్‌కి బానిసైన 9వ తరగతి విద్యార్థి (17) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌(M) బోరిగాంలో చోటుచేసుకుంది. SI వివరాల ప్రకారం..రాకేశ్‌కి అతడి తండ్రి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి బాలుడు గేమ్‌లు ఆడుతూ ఫోన్‌కి బానిసయ్యాడు. దీంతో తండ్రి ఫోన్ అతిగా వాడోద్దని మందలించి ఫోన్ తీసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఉరేసుకున్నాడు.

News May 10, 2024

MBNR:14న ఎన్టీఆర్ కళాశాలలో ఉద్యోగ మేళా

image

MBNR జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. TSKC, ప్లేస్మెంట్ సెల్ సౌజన్యంతో పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఏదైనా డిగ్రీ ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, రెస్యూమ్ తో కళాశాల సెమినార్ హాల్‌లో హాజరు కావాలన్నారు.

News May 10, 2024

నేడు నారాయణపేటకు మోదీ.. మక్తల్‌కు రేవంత్

image

నేడు ఉమ్మడి జిల్లాలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ పర్యటించనున్నారు. డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో మేదీ, అదే జిల్లా మక్తల్‌లో వంశీచంద్ కోసం రేవంత్ ప్రచారం చేయనున్నారు. ఇద్దరి సభలు ఒకే సమయంలో సభలు ఉండటంతో అందరి చూపు నారాయణపేటపై పడింది. పాలమూరులో అగ్రనేతల పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఎం సొంత జిల్లా కావడంతో మోదీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. నేడు షాద్‌నగర్‌లో రేవంత్ పర్యటిస్తారు.

News May 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ
∆} వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరు మండలంలో బీఆర్ఎస్ రోడ్ షో కార్నర్ మీటింగ్
∆} కూసుమంచి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనం
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News May 10, 2024

సిద్దిపేట: పురిటిగడ్డకు నేడు కేసీఆర్

image

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నేడు పురిటి గడ్డ సిద్దిపేటకు రానున్నారు. మెదక్‌ MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ముస్తాబాద్‌ చౌరస్తా నుంచి పాతబస్టాండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ చౌరస్తా వరకు భారీ రోడ్‌షో, సభ నిర్వహించేలా హరీశ్‌రావు ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు సిద్ధయయ్యారు. కాగా ఈ సభతో కేసీఆర్ ప్రచారం ముగియనుంది.