Telangana

News May 9, 2024

కరీంనగర్ ఉద్యమాల పురిటి గడ్డ!

image

కరీంనగర్ గడ్డ ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఉద్యమాల గడ్డ అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో రోడ్ షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి నాంది వేసిందే కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ ప్రజలు తనను కడుపులో పెట్టి చూసుకున్నారని.. కరీంనగర్ లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఉనికి లేదని తెలిపారు. కరీంనగర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని కేసీఆర్ చెప్పారు.

News May 9, 2024

రేపు హైదరాబాద్‌కు మోదీ.. ఆంక్షలు

image

MP ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ప్రధాని మోదీ హైదరాబాద్‌‌కు వస్తున్నారు. కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, మాధవీలతకు మద్దతుగా‌ ఆయన ఎల్బీస్టేడియంలో BJP జనసభ‌లో ప్రసంగిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సా. 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీస్టేడియం చుట్టూ ఆంక్షలు విధించారు. BJR విగ్రహం, AR పెట్రోల్‌ పంప్‌ దారి మూసివేస్తారు. ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.

News May 9, 2024

FLASH.. WGL: రైలు ఎక్కేందుకు వచ్చి గుండెపోటుతో మృతి

image

వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన మొహమ్మద్ ఇక్బాల్(58)గా పోలీసులు, రైల్వే సిబ్బంది గుర్తించారు. వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్లేందుకు నవజీవన్ రైలు ఎక్కుతుండగా ఈ విషాద సంఘటన జరిగింది.

News May 9, 2024

రేపు హైదరాబాద్‌కు మోదీ.. ఆంక్షలు

image

MP ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ప్రధాని మోదీ హైదరాబాద్‌‌కు వస్తున్నారు. కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, మాధవీలతకు మద్దతుగా‌ ఆయన ఎల్బీస్టేడియంలో BJP జనసభ‌లో ప్రసంగిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సా. 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీస్టేడియం చుట్టూ ఆంక్షలు విధించారు. BJR విగ్రహం, AR పెట్రోల్‌ పంప్‌ దారి మూసివేస్తారు. ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.

News May 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఎల్లారెడ్డిపేట మండలంలో చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి.
*మహాముత్తారం మండలంలో కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి.
*మెట్పల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత.
*కరీంనగర్లో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్.
*రేపు కమలాపూర్‌కు కేటీఆర్, సిరిసిల్లకు కేసీఆర్.
*పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు: జగిత్యాల కలెక్టర్.

News May 9, 2024

పాల్వంచ: పిడుగుపాటుకు 17 గొర్రెలు మృతి

image

పిడుగుపాటుకు 17 గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన పాల్వంచ మండల పరిధి బిక్కు తండా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మున్సిపల్ పరిధి వెంగళరావు కాలనీకి చెందిన వేల్పుల పెద్దిరాజు మేతకు తన గొర్రెలను మండల పరిధి బిక్కు తండా ప్రాంతానికి తీసుకెళ్లాడు. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి తోడు పిడుగు పడడంతో 17 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.

News May 9, 2024

రేపు పాలమూరుకు మోదీ, ప్రియాంక గాంధీ

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్రవారం పాలమూరు జిల్లాకు రానున్నారు. బీజేపీ పాలమూరు అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించే బహిరంగ సభకు నరేంద్ర మోదీ రానున్నారు. అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా షాద్ నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.

News May 9, 2024

గోదావరిలో పడి బాలుడి మృతి

image

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెంలో జరిగింది. టీడీపీ ఎంపీటీసీ పాయం దేవి కుమారుడు పాయం జితేంద్ర(15) నెల్లిపాక గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి గేదెలను ఇంటికి తోలుకుని వస్తూ ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. బాలుడి తలిదండ్రుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

News May 9, 2024

NZB: బ్రాండ్ బాటిళ్లలో చీప్ లిక్కర్.. వైన్స్ సీజ్

image

హయ్యర్ బ్రాండ్‌ బాటిళ్లలో చీప్ లిక్కర్ కలుపి అమ్ముతున్న ఓ వైన్స్‌ను గురువారం పోలీసులు సీజ్ చేశారు. నిజామబాద్‌లోని పరమేశ్వరి వైన్స్‌లో స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ గురువారం సోదాలు నిర్వహించారు. 37 ఫుల్ బాటిళ్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని, వైన్స్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో SHO దిలీప్, SIలు మల్లేశ్, సుష్మిత, సింధు, సిబ్బంది ఉన్నారు.

News May 9, 2024

మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలి: కావ్య

image

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ప్రజలు మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హన్మకొండలో బీసీ సంఘం సమావేశంలో కావ్య మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల బతుకులు చీకటి మయమవుతాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు తెలంగాణకు, గుజరాత్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమని తెలిపారు.