Telangana

News May 9, 2024

NGKL: తేనెటీగల దాడిలో యువకుడు మృతి

image

తేనెటీగల దాడిలో యువకుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తారక్(22) తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో నేలను దున్నుతున్న క్రమంలో చెట్టు పై ఉన్న తేనెటీగలు ఒకసారిగా తారక్ పై దాడి చేయడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుకుంటూ పొలంలో వెళుతుండగా బోర్లపడి మృతి చెందాడు. తారక్ అవివాహితుడు గ్రామంలో విషాదం నెలకొంది.

News May 9, 2024

మెట్ పల్లి: కాళ్లు మొక్కి ఓట్లు అడిగిన బీజేపీ నాయకులు

image

మెట్ పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు గురువారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకొని పలువురి కాళ్లు మొక్కుతూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొయ్యల లక్ష్మణ్, బొడ్ల ఆనంద్, సంకేత విజయ్ తదితరులు పాల్గొన్నారు.

News May 9, 2024

ఖమ్మం: వైన్స్ బంద్.. బారులు తీరిన మందుబాబులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మద్యం ప్రియులు ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. దీంతో వైన్ షాపుల దగ్గర రద్దీ వాతావరణం నెలకొంది.

News May 9, 2024

ఉమ్మడి‌ మెదక్‌లో బీర్ల కొరత

image

కొద్ది రోజులుగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లైట్ బీర్లు అందుబాటులో లేవని నంగనూరులోని వైన్ షాపుల నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి బీర్ల కొరతను అరికట్టాలని రెగ్యులర్ కస్టమర్లు కోరుతున్నారు.

News May 9, 2024

మంత్రి తుమ్మల వాహనం తనీఖీ (VIDEO)

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం భద్రాచలం వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మంత్రి తుమ్మల సిబ్బందికి సహకరించారు. ఎన్నికలలో డబ్బు, మద్యం అక్రమ రవాణా కాకుండా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

News May 9, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6750

image

బుధవారం అమావాస్య సందర్భంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ బంద్ ఉండగా.. నేడు ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే మొన్నటి (మంగళవారం)తో పోలిస్తే ఈరోజు రూ.25 ధర పెరిగింది. మొన్న రూ.6,725 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు రూ.6,750 ధర పలికింది. అయితే పత్తి ధరలు భారీగా పడిపోతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News May 9, 2024

ఆళ్ళపల్లి: పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

image

రానున్న పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆళ్ళపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామ ప్రజలు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం తమ గ్రామంలోకి ప్రచారానికి రావద్దు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడంలో కేవలం ఎన్నికల హామీలు ఇస్తున్నారు.. కానీ పరిష్కరించడం లేదన్నారు. తమ గ్రామం ఎన్నికలప్పుడే గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.

News May 9, 2024

కడియంకు రాజకీయ ఉనికి లేకుండా చేయాలి: ఆరూరి

image

కడియం శ్రీహరికి రాజకీయ ఉనికి లేకుండా MP ఎన్నికల్లో ఆయన కూతురు కావ్యను ఒడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వరంగల్ BJP MP అభ్యర్థి ఆరూరి రమేశ్ అన్నారు. ధర్మసాగర్ మండలంలో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించి, తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాజకీయ భవిష్యత్తు కోసం అనేకమంది దళితులను నమ్మించి మోసం చేసిన వ్యక్తి కడియం అన్నారు. ధర్మసాగర్‌లో డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తానన్నారు.

News May 9, 2024

MBNR: ఆ మరుసటి రోజు నుంచి నేతల్లో టెన్షన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు ఎంపీ స్థానాల్లో ఎన్నికల బరిలో ఉన్న 50 మంది అభ్యర్థులు తమ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత, ఓటర్ల పని పూర్తవుతుంది. అభ్యర్ధులకు మాత్రం ఆ మరుసటి రోజు నుంచి టెన్షన్ ప్రారంభం కానుంది. ఫలితం కోసం 22 రోజుల నిరీక్షణ తప్పదు. దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

News May 9, 2024

నల్గొండ జిల్లాలో జీరో షాడో

image

నల్గొండ జిల్లా ఆమగల్లులో జీరో షాడో కనిపించింది. అంటే మిట్టమధ్యాహ్నం రోజూ కనిపించే మన నీడ ఇవాళ కనిపించదు. నిటారుగా ఉండే మనిషి, వస్తువు లేదా జంతువుల నీడలు కనిపించవు. ఇది ఇవాళ మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై 2, 3 నిమిషాల పాటు కొనసాగుతుంది.