Telangana

News May 9, 2024

NZB: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్‌ పట్టణం నాగారంలోని 300 క్వార్టర్స్‌కు చెందిన చెన్నూరు కావేరి(30) అనే వివాహిత బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త సంతోష్ ఆటోడ్రైవర్ కాగా తాగి డబ్బులు వృథా చేస్తున్నాడని వారిద్దరి మధ్య గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే కావేరిని తన భర్తే హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 9, 2024

సంగారెడ్డి: ముళ్లపొదల్లో పసికందు మృతదేహం

image

సంగారెడ్డి జిల్లాలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ శివారులో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో పసికందు మృతదేహాన్ని దుండగులు వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News May 9, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.17,000 పలకగా.. 341 రకం మిర్చి రూ.18 వేల ధర పలికింది. వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14,300.. 5531 రకం మిర్చికి రూ.11 వేల ధర వచ్చింది. అలాగే టమాటో మిర్చికి రూ.31,500 ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News May 9, 2024

నల్గొండ: రిక్షా తొక్కుతూ వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ 

image

శివసేన బలపరిచిన నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి పూస శ్రీనివాస్ రిక్షా తొక్కుతూ వచ్చి నామినేషన్ వేశారు. ఆయన అర్ధనగ్నంగా నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్ పత్రాలను కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. నిరుద్యోగుల గొంతుకనై పోరాడతానని శ్రీనివాస్ చెప్పారు. 

News May 9, 2024

ఆదిలాబాద్: ఉరేసుకొని బలవన్మరణం

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిలాబాద్ పట్టణం రాంనగర్‌లో రాపర్తి ప్రకాష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్ఐ యూనుస్ తెలిపిన వివరాల మేరకు.. కూలి పని చేసుకుని జీవించే ప్రకాష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమస్య తట్టుకోలేక జీవితంపై విరక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News May 9, 2024

HYD: అక్రమ రేషన్ రవాణాపై 45 కేసులు!

image

HYD పరిధిలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 45కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ నుంచి మహారాష్ట్రకు, కాటేదాన్ నుంచి కర్ణాటకకు, జీడిమెట్ల, వనస్థలిపురం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న టన్నుల కొద్ది రేషన్ బియ్యం సీజ్ చేశారు. అత్తాపూర్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో అక్రమంగా గోదాంలు నిర్వహిస్తున్న వారిపై అధికారులు నిఘా పెట్టారు.

ఎన్నికల సమరానికి.. ఇక మూడు రోజులే !

image

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో పాలమూరులో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. MBNR, NGKL లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.

News May 9, 2024

HYD: NOTA అంటోంది.. నేను తక్కువేం కాదని..!

image

బ్యాలెట్ యూనిట్ పై అభ్యర్థులందరి తర్వాత చివరి వరుసలో NOTA అని ఉంటుంది. సాధారణంగా నోటాకి ఓటు వేస్తే ఏం లాభం అని అనుకుంటారు. కానీ.. గత ఎంపీ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి అభ్యర్థి గెలుపోటముల్లో కీలకపాత్ర పోషించిన NOTA తన సత్తా చూపి నేనేం తక్కువ కాదని నిరూపించింది. BRS అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజార్టీతో గెలవగా.. అదే నోటాకు 17,895 ఓట్లు వచ్చాయి.