Telangana

News May 9, 2024

తానూర్: వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

image

ఉపాధి హామీ పనులకు వెళ్లి వడ దెబ్బకు గురైన కూలి మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. బోసి గ్రామానికి చెందిన పర్వార్ విఠ్ఠల్ (60) బుధవారం కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి రాగా.. అస్వస్థతకు గురై పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వడ దెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

News May 9, 2024

పోలీసులు అతిగా పోవద్దు.. వచ్చేది మా ప్రభుత్వమే: KCR

image

పోలీసులు అతిగా పోవద్దని, వచ్చేది మా ప్రభుత్వమేనని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాత్రి పటాన్‌చెరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో BRS అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రసంగించారు. పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించాలని, రాజకీయాల్లో వేలు పెట్టొద్దన్నారు. తెలంగాణ కోసం నా ప్రాణమైన బలి పెడతాను కానీ అన్యాయం జరగనీయం అన్నారు. బడే బాయ్ చోటే బాయ్ కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.

News May 9, 2024

నాగర్‌కర్నూల్: 4 నెలలు.. 136 ప్రమాదాలు

image

NGKL జిల్లాలో 4 నెలల్లో 136 రహదారి ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదాల్లో 68 మంది మరణించగా.. 168 మంది తీవ్రంగా గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా బిజినేపల్లి మండలంలో ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. రహదారులపై వాహనాల నడుపుతున్న సమయంలో వేగాన్ని నియంత్రించలేకే ప్రమాదాల బారిన పడుతున్నారు. కాగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

News May 9, 2024

MBNR, NGKLలో కొత్త ఓటర్లు వీరే..

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. MBNR లోక్ సభ పరిధిలో 2,977 మంది పురుషులు, 8385 మంది స్త్రీలు, 3 ఇతరులు కలిపి మొత్తం 15,274 మంది.. NGKL లోక్ సభ నియోజకవర్గంలో 2501 మంది పురుషులు, 4585 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 7,538 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News May 9, 2024

చార్మినార్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్

image

పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో డ్రగ్స్ కంట్రోల్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చార్మినార్ బస్ స్టాండ్ పార్కింగ్‌లో డ్రగ్స్‌కి అలవాటు పడ్డ వారికి నిషేధిత టైడోల్ ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న యాకుత్‌పురకు చెందిన హర్షద్ ఖాన్‌ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద 100కి పైగా ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన మెదడుపై ప్రభావం చూపి మనిషి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.

MBNR: ఎంపీ ఎన్నికలు.. సీఎం సొంత జిల్లాలో బిగ్ ఫైట్..!

image

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. MBNR పరిధిలో డీకే అరుణ(BJP), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) పోటీలో ఉన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య కేవలం 4 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని సర్వేల్లో తేలడంతో ఇక్కడ సీఎం మరింత దృష్టి సారించారని టాక్. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రేవంత్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

News May 9, 2024

10 వరకు పోస్టల్ బ్యాలెట్ల గడువు: వరంగల్ కలెక్టర్ 

image

పోస్టల్ బ్యాలెట్ల గడువును ఈ నెల 10 వరకు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో జారీ చేసిన 12,710 పోస్టల్ బ్యాలెట్లలో ఇప్పటికీ 9,544 బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు  ఈ నెల 10 లోగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News May 9, 2024

HYD: ఇక్కడ ఇంత వరకు BRS గెలవలేదు..!

image

సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా BRS పార్టీ గెలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 6 BRS, ఒకటి MIM గెలిచింది. ఇక మల్కాజిగిరిలో 7కు 7 BRS గెలిచింది. ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నా ఎంపీలుగా మాత్రం గెలవలేదు. మరి ఈసారి 2ఎంపీ నియోజకవర్గాల్లోనూ BRS గట్టిగా ఉంది. పార్టీని గెలిపించేందుకు KCR, KTR ప్రచారం చేస్తున్నారు. మీ కామెంట్?