India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడ వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ (M) నీలా గ్రామానికి చెందిన బలిరాం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు భైంసాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శివాజీ, బలీరాం కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బలిరాంతో పాటు వర్నికి చెందిన అనసూయ, నవీపేట చెందిన అనురాధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుంచి బోనాల వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయితేజ్ (23) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కరీంనగర్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రాజకీయ పార్టీలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుపై సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 విగ్రహాలను నిబంధనల ప్రకారం వివిధ చెరువులు, శివార్లలో నిమజ్జనం చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన గణేశ్ ఉత్సవాలు, అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.
గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో పాటు కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నేడు CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో కోకాపేట లే అవుట్, నియోపొలిస్, స్పెషల్ ఎకనామిక్ జోన్(SEZ)లో తాగునీరు, నూతన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కీలక ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.
గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3తో రూ.1,200 కోట్లతో ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2ను CM రేవంత్ ప్రారంభిస్తారు. GHMC, సిటీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ORR పరిధి GPలకు నీటి సరఫరా అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా.. ఇందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను CM ప్రారంభించనున్నారు.
ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో సిటీ శివారు ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తీరనున్నాయి. దాదాపు 14 మండలాల్లోని 25 లక్షల మంది ప్రజలకు మేలు జరగనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, RCపురం, పటాన్‌చెరు, బొల్లారం ప్రాంత వాసులకు మంచినీరు అందించనున్నారు.
భవిష్యత్‌లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు CM నేడు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు 20 TMCల నీరు తరలించే బృహత్కర కార్యక్రమం ఇది. 17.50 TMCలు తాగునీటి అవసరాలు, 2.50 TMCలు మూసీ పునరుజ్జీవనం కోసం వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు ఉస్మాన్‌సాగర్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
నేడు గండిపేటలో CM రేవంత్ పర్యటిస్తారు. ఇప్పటికే కలెక్టర్ నారాయణరెడ్డి, MLA ప్రకాశ్ గౌడ్, జలమండలి MD అశోక్ రెడ్డి, రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3కు శంకుస్థాపన, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2ను CM ప్రారంభిస్తారు. అనంతరం CM బహిరంగ సభ ఉంటుందని MLA ప్రకాశ్ గౌడ్ తెలిపారు. CM రాకతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.