Telangana

News April 4, 2025

MBNR: స్థానిక సంస్థల బరిలో పోటీకి యువత సై!

image

త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు యువత సిద్ధం అవుతోంది. ఓ వైపు ప్రభుత్వాలు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, మరో వైపు తమ సమస్యల పరిష్కారం కోసం తామే ఎన్నికల బరిలో నిలవాలని తలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే అన్ని పార్టీలు ఏ మేరకు వారికి సీట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.

News April 4, 2025

KMM:ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 16 లక్షల స్వాహా..  

image

ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి రూ.16 లక్షలు కాజేసిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం వివేకానంద కాలనీకి చెందిన గుదిబండ్ల ఆదిలక్ష్మి మామిళ్ళగూడెంకి చెందిన పలువురు యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రూ. 16 లక్షల పైగా మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు

News April 4, 2025

NLG: అగ్రిగోల్డ్ మోసానికి పదేళ్లు

image

ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట దక్కడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 2015లో కేసులు నమోదు చేశారు. జిల్లాలో సుమారు వేల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఉన్నారు. సుమారు 10 ఏళ్లు కావస్తున్నా.. బాధితులకు నేటికీ చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

News April 4, 2025

HYD: గర్ల్స్ క్యాబ్ ఎక్కుతున్నారా.. జాగ్రత్త!

image

HYDలో క్యాబ్, ఆటో‌లో ప్రయాణించే యువతులు, మహిళలకు పోలీసులు కీలక సూచన చేశారు. ‘వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేస్తే అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్ రూట్ మార్చితే వెంటనే ‘Hawk Eye’ యాప్‌లో SOS బటన్ నొక్కండి. దీంతో సన్నిహితులు, పెట్రోలింగ్ పోలీస్, సమీపంలోని PSకు రైడ్ వివరాలు వెళ్తాయి. వెంటనే మిమ్మల్ని సేవ్ చేస్తారు’ అని తెలిపారు. ఇటీవల పహాడీ‌షరీఫ్‌లో యువతిపై కారు డ్రైవర్ అఘాయిత్యం చేశాడు. బీ కేర్ ఫుల్ గర్ల్స్!

News April 4, 2025

ఖమ్మం జిల్లాలో నేటి నేటి ముఖ్యాంశాలు

image

∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటక

News April 4, 2025

కరీంనగర్: నేటి నుంచి జిల్లా ఆసుపత్రి కార్మికుల సమ్మె

image

నేటి నుంచి ఆసుపత్రి కార్మికులు సమ్మె చేయనున్నారు. కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించాలని కోరుతూ శుక్రవారం నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

News April 4, 2025

NLG: జిల్లాలో మామిడికి గడ్డు పరిస్థితులు!

image

ఉద్యాన పంటల్లో ఫలరాజంగా ప్రసిద్ధి చెందిన మామిడికి ఈ ఏడాది గడ్డు పరిస్థితులు దాపురించాయి. గతేడాది సకాలంలో వర్షాలు కురియక, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత సకాలంలో రాలేదు. వచ్చిన పూత కూడా నిలవకుండా మాడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దట్టంగా కురిసిన పొగమంచు పూతను దెబ్బతీసిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది కనీసం 1 నుంచి 2 టన్నుల వరకైనా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు.

News April 4, 2025

NLG: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

News April 4, 2025

NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

image

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2025

MBNR: ముగ్గురిపై కేసు నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్‌తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.