Telangana

News May 9, 2024

HYD: డీఆర్సీ బృందాలు బాధ్యతగా పనిచేయాలి: రోనాల్డ్ రాస్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో DRC బృందాల సభ్యులు విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సూచించారు. జూబ్లీహిల్స్‌లోని భీమ్ ఆదివాసీ భవన్‌లో DRC బృందాలు, అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఎలాంటి సమస్యలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ సాఫీగా జరిగేలా చూడాలన్నారు.

News May 9, 2024

ఉమ్మడి జిల్లాలో మైనార్టీ ఓటర్లకు గాలం !

image

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలోని ముస్లిం, మైనార్టీ ఓటర్లను తమవైపు మళ్లించుకునేందుకు నాయకులు ప్రతి రోజు వారి నివాస ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమై గెలుపు ఓటమిని నిర్ణయించిన నేపథ్యంలో ఈసారి వారి ఓట్లు తమ పార్టీకే పడేందుకు పట్టణ ప్రాంత నాయకులు శతవిధాలా యత్నిస్తున్నారు.

News May 9, 2024

నల్గొండ జిల్లాలో హత్య

image

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామంలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న ఆంబోతు శుక్ర నాయక్(40 )ను గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. మృతదేహాన్ని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

పెద్దపల్లి: సింగరేణి కార్మికుల చేతుల్లో నేతల భవిష్యత్!

image

పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఐదింటిలో సింగరేణి కార్మికులే అధికంగా ఉన్నారు. ఇప్పుడున్న నేతల భవిష్యత్ సింగరేణి కార్మికుల చేతుల్లోనే ఉంది. 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 28,829 మంది కార్మికులు, 15 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలతో కలిపితే
దాదాపు 1.80 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల భవిష్యత్ కార్మికుల ఓట్ల పైనే ఉందని విశ్లేకుల అంచనా. దీనిపై మీ కామెంట్.

News May 9, 2024

కొత్తగూడెం: చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన కారు

image

ప్రమాదవశాత్తు ఓ కారు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన ఏటూరునాగారంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి మేడారం దర్శనానికి కారు వెళ్తోంది. ఈ క్రమంలో ఏటూరునాగారంలోని జీడివాగు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

News May 9, 2024

వనపర్తి: యువతిపై అత్యాచారం.. బెదిరింపులు

image

HYD అమీర్‌పేట్‌‌లో అత్యాచారం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయి అత్యాచారం చేశాడు. వారికి వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి PSలో ఫిర్యాదు చేసింది.

News May 9, 2024

MBNR: 31లోపు పరీక్ష ఫీజు చెల్లించండి

image

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్-4, 6 ఫీజులను చెల్లించాలని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ బుధవారం తెలిపారు. ఈనెల 31లోగా ఆన్లైన్ లో చెల్లించాలని, బీఏ, బీకాం వారు పేపర్ కు రూ.150, బీఎస్సీ వారు పేపర్ కు రూ.150తో పాటు ప్రాక్టికల్స్ రూ.150 చెల్లించాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 9, 2024

ఇండియా కూటమి వైపే ప్రజలు: జగ్గారెడ్డి

image

దేశంలో జరిగిన 50% ఓటింగ్‌లో ఇండియా కూటమి వైపే ప్రజల మొగ్గు చూపినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బంగారం ధర తగ్గుతుందని చెప్పారు. రాహుల్ కుటుంబ త్యాగం ముందు మోదీ, అమిత్ షా రాజకీయం జీరో అని తెలిపారు.

News May 9, 2024

ADB: ఈ ఎంపీ స్థానం.. మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం

image

ADB MP స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలతో పొలిస్తే BJPలో ప్రస్తుతం ఉత్సహం కనిపించడం లేదు. SKZRకు అమిత్ షా, ఖానాపూర్‌కు రాజాసింగ్ తప్పితే రాష్ట్ర, జాతీయ నేతలెవరూ రాలేదు. గ్రూపు విభేదాలకు నిలయమైన కాంగ్రెస్‌లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ వచ్చినా మార్పు కనిపించటంలేదు. ప్రస్తుతం BRS డీలాపడింది. నేతలు పార్టీ మారటం ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

News May 9, 2024

నేడు నర్సాపూర్ రానున్న రాహుల్ గాంధీ

image

నర్సాపూర్ పట్టణానికి నేడు సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని వెల్దుర్తి మార్గంలోని ఖాళీ ప్రదేశంలో సభకు ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను మంత్రి కొండ సురేఖ, ఏఐసీసీ ఇన్‌ఛార్జీ సురేశ్ తదితరులు పరిశీలించారు. భారీగా జనసమీకరణకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు.