Telangana

News May 9, 2024

HYD: యువతిపై అత్యాచారం.. బెదిరింపులు

image

అమీర్‌పేట్‌‌లో అత్యాచారం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయికృష్ణ అత్యాచారం చేశాడు.వారికి వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి PSలో ఫిర్యాదు చేసింది.

కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

image

కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మంగపేట PHC పరిధిలోని పొగళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో ఏఎన్ఎం-1గా విధులు నిర్వహిస్తున్న పుష్పలత(35)గత నెల 27న విధులకు భర్త శ్రీనివాస్‌తో కలిసి బైక్‌పై పాల్వంచ నుంచి బయల్దేరింది. పాతూరు శివారులో ఎదురుగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పలత బుధవారం మృతిచెందారు.

News May 9, 2024

కాజీపేట: ఊయల కట్టిన స్టూల్‌ మీద పడి చిన్నారి మృతి

image

ఊయల కట్టిన స్టూల్‌ మీద పడి చిన్నారి మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన లోక్‌నాథ్‌ ఖర్ష్‌ తాపీమేస్త్రీ-భారతి దంపతులకు ముగ్గురు పిల్లలు. నాలుగేళ్ల కిందట కుటుంబంతో సహా కాజీపేటకు వలస వచ్చారు. ఆయన భార్య సోమిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి దర్వాజ, ఇనుప స్టూలుకు చీరతో ఊయల కట్టి చిన్నారి రోషిత (6 నెలలు)ను అందులో పడుకోబెట్టింది. స్టూల్‌ అదుపు తప్పడంతో ఊయలలో ఉన్న చిన్నారి కిందపడి గాయాల పాలై చనిపోయింది.

News May 9, 2024

ADB: వ్యభిచార గృహాలపై దాడులు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూడు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మూడు కాలనీల్లో ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న ఆరుగురు యువతులను, ఎనిమిది మంది విటులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

News May 9, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు నిజామాబాదీ

image

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనుంది. తమ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు తుది సన్నాహాల్లో ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు. నిఖత్‌తో పాటు ప్రీతి పవార్, పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. ఇక దేశం మొత్తం నిఖత్ జరీన్ బంగారం లాంటి ప్రదర్శన చేస్తుందని ఎదురు చూస్తోంది.

News May 9, 2024

పెద్దపల్లి: సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్!

image

వేసవిలో ఎన్నికల నిర్వహణ అభ్యర్థులతో పాటు అధికారులకు సవాల్‌గా మారింది. మావోయిస్టు ప్రాంతమైన పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. 2019లో ఇక్కడ 65.43 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2014లో ఇది 71.70 శాతంగా ఉంది. పోలింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News May 9, 2024

MBNR: ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

image

ఉమ్మడి జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్(సీబీ ఎస్ఈ-ఆంగ్ల మాధ్యమం) MPC, బైపీసీ, CEC కోర్సుల్లో ప్రవేశాలకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బాలానగర్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 19 నుంచి ఏకలవ్య ఆదర్శ పాఠశాల బాలానగర్‌లో విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, ఆధార్, ఫొటోలు కులం సమర్పించాలన్నారు.

News May 9, 2024

HYD: దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: వీహెచ్

image

దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYD గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించేందుకు ప్రయత్నిస్తే.. నరేంద్ర మోదీ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బీజేపీ స్టేట్‌మెంట్లు చేస్తోందని ఆరోపించారు.