Telangana

News May 9, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు నిజామాబాదీ

image

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనుంది. తమ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు తుది సన్నాహాల్లో ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు. నిఖత్‌తో పాటు ప్రీతి పవార్, పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. ఇక దేశం మొత్తం నిఖత్ జరీన్ బంగారం లాంటి ప్రదర్శన చేస్తుందని ఎదురు చూస్తోంది.

News May 9, 2024

పెద్దపల్లి: సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్!

image

వేసవిలో ఎన్నికల నిర్వహణ అభ్యర్థులతో పాటు అధికారులకు సవాల్‌గా మారింది. మావోయిస్టు ప్రాంతమైన పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. 2019లో ఇక్కడ 65.43 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2014లో ఇది 71.70 శాతంగా ఉంది. పోలింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News May 9, 2024

MBNR: ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

image

ఉమ్మడి జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్(సీబీ ఎస్ఈ-ఆంగ్ల మాధ్యమం) MPC, బైపీసీ, CEC కోర్సుల్లో ప్రవేశాలకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బాలానగర్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 19 నుంచి ఏకలవ్య ఆదర్శ పాఠశాల బాలానగర్‌లో విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, ఆధార్, ఫొటోలు కులం సమర్పించాలన్నారు.

News May 9, 2024

HYD: దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: వీహెచ్

image

దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYD గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించేందుకు ప్రయత్నిస్తే.. నరేంద్ర మోదీ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బీజేపీ స్టేట్‌మెంట్లు చేస్తోందని ఆరోపించారు.

News May 9, 2024

HYD: దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: వీహెచ్

image

దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYD గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించేందుకు ప్రయత్నిస్తే.. నరేంద్ర మోదీ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బీజేపీ స్టేట్‌మెంట్లు చేస్తోందని ఆరోపించారు.

News May 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
✓ఎన్నికల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓తల్లాడ మండలంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్
✓ఇల్లందు నియోజకవర్గంలో మాజీ గవర్నర్ తమిళిసై పర్యటన
✓భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
✓వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 9, 2024

కరీంనగర్: 1,466 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు!

image

ఉమ్మడి జిల్లా పరిధిలోని KNR, PDPL, NZB లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,852 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇందులో 1,466 సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. ఈ కేంద్రాల పరిధిలో గతంలో జరిగిన అలజడులు, నమోదైన కేసుల విషయంలో ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించారు.

News May 9, 2024

నేడు భువనగిరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా

image

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు 50 వేల మందిని సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించనున్నారు. 

News May 9, 2024

నేడు నిర్మల్ జిల్లాలో KTR పర్యటన

image

నేడు నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు భైంసాలో రోడ్డు షో నిర్వహించనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు.

News May 9, 2024

ఇల్లెందులో నేడు తమిళిసై రోడ్ షో

image

మహబూబాబాద్ లోక్‌సభ స్థానం BJP అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌కు మద్దతుగా ఆపార్టీ నాయకురాలు తమిళిసై ఇల్లెందులో నేడు రోడ్ షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోపీకృష్ణ బుధవారం తెలిపారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.