Telangana

News April 4, 2025

నిజాంపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రహమాన్ బైక్‌పై వెళ్తూ రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పను ఎక్కించి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.

News April 4, 2025

జమ్మికుంట: మున్సిపల్ కమిషనర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

image

ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.

News April 4, 2025

వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

News April 4, 2025

పింఛన్ కోసం వచ్చే మహిళను గర్భవతిని చేశాడు..!

image

పింఛన్ కోసం వచ్చిన చెవి, మూగ మహిళను ఓ వ్యక్తి గర్భవతిని చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. సుబ్లేడులో మినీ ఏటీఎం నిర్వహిస్తున్న కామళ్ల వీరవయ్య వద్దకు ఆయన బంధువైన మహిళ పింఛన్ కోసం వచ్చేది. ఈ క్రమంలో వీరయ్య అమెను నమ్మించి గర్భవతిని చేశాడు. విషయం తెలిసి బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరయ్యను రిమాండ్‌కు తరలించారు.

News April 4, 2025

అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్

image

అమ్మాయి పుడితే ఇంటిల్లిపాది పండగ చేసుకోవాలని, అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే ఆడపిల్లలు పుడతారని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కామేపల్లి(మం) కొత్త లింగాలలో ఉండేటి అమృత-సుధాకర్ దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టగా, కలెక్టర్ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం తల్లిదండ్రులను సత్కరించారు.

News April 4, 2025

ధాన్యానికి రూ.500 బోనస్ చరిత్ర: మంత్రి పొంగులేటి

image

రాష్ట్రంలో ప్రజలు మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతును రాజు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో మంత్రి ధాన్యం కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. దేశచరిత్రలోనే మొదటిసారిగా ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో నేతలు, అధికారులు పాల్గొన్నారు.

News April 4, 2025

ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టుకు రూ.29 కోట్లు

image

ఖమ్మం నగరంలోని ఖిల్లాపై రోప్ వే ప్రాజెక్టుకు జిల్లా యంత్రాంగం రూ.29 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం ఖర్చుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఖిల్లాపై రోప్ వే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఖిల్లా మెట్ల మార్గం కుడి వైపున రెండు అంతస్తుల బేస్ స్టేషను ఏర్పాటు చేయడంతో పాటు రోప్ వేలో 200-250 మంది బరువును తట్టుకునే సామర్థ్యమున్న 275 మీటర్ల తీగలను ఏర్పాటు చేయనున్నారు.

News April 4, 2025

ఖైరతాబాద్: టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్

image

గ్రేటర్ పరిధిలో వర్షాల పట్ల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అన్నారు. వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే జీహెచ్ఎంసీ నంబర్ 040-21111111కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 4, 2025

తూప్రాన్: ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అవార్డు

image

తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని సాధించినందుకు బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాదులో సీడీఎంఏ అధికారి చేతుల మీదుగా బెస్ట్ అప్రిసియేషన్ అవార్డును కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి 82.17% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. అవార్డు లభించినందుకు మేనేజర్ రఘువరన్, వార్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు.

News April 4, 2025

జైతాపూర్‌లో పంట కాలువలో పడి మహిళ మృతి

image

ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) అనే మహిళ పంట కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు ఏప్రిల్ ఒకటో తేదీన నిజామాబాద్ వెళ్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదని, పంట కాలువలో తన చెల్లి చనిపోయిన స్థితిలో ఉన్నట్టు పోలీసులకు పురిమేటి నాగయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.