Telangana

News May 8, 2024

ఆదిలాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్

image

ఆదిలాబాద్ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉట్నూర్‌కి చెందిన ఓ యువతి ఈ నెల 4న ఇంటికి వెళ్తానని ప్రిన్సిపల్‌కి సెలవు పత్రం ఇచ్చి కాలేజీ నుంచి బయటికి వచ్చింది. అయితే బుధవారం ఆమె తండ్రి తనను చూడడానికి కాలేజీకి వెళ్లడంతో విషయం బయటపడింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ CI అశోక్ తెలిపారు.

News May 8, 2024

MBNR: ‘ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లేదా? ఇలా చేయండి’

image

సార్వత్రిక ఎన్నికల సమరం మరికొన్ని రోజుల్లో జరగనుండగా ఎన్నికల సంఘం ఓటర్లకు పలు సూచనలు చేసింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్(VIS) లేనివారు వెంటనే ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. దీనికోసం VOTER HELPLINE యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని VIS డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే దీనిని చాలా మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. లేకపోతే మీ BLOని సంప్రదించాలని వెల్లడించింది.

News May 8, 2024

పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలి: హనుమంతు

image

పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే జెండగే మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో భువనగిరి పార్లమెంట్కు చెందిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా స్థాయి ట్రైనర్స్ నర్సింహ్మారెడ్డి మైక్రో అబ్జర్వర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు.

News May 8, 2024

రేపటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు

image

MBNR: 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఇంటర్ కార్యాలయ అధికారులు తెలిపారు. రేపటి నుండి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని వారు తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుండి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ తెలిపిందని వారు పేర్కొన్నారు.

News May 8, 2024

కమలాపూర్: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ దేశరాజ్‌పల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి సమీపంలోని పంట పొలాల వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు గీతా కార్మికులు తెలిపారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించినట్లు పేర్కొన్నారు.

News May 8, 2024

MBNR: ప్రభుత్వ కళాశాలలు లేక.. విద్యార్థుల ఇబ్బందులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మండలాల కేంద్రాలలో ప్రభుత్వ కళాశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజోలి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఉండవల్లి, కేటి దొడ్డి, ఎర్రవల్లి, సీసీ కుంట, రాజాపూర్, మహమ్మదాబాద్, మూసాపేట, ఉప్పునుంతల, కడ్తాల్, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, ఉల్కొండ, పెంట్లవల్లి, చిన్నంబావి,రేవల్లి, అమరచింత, కృష్ణ, నర్వ, మరికల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.

News May 8, 2024

HYD: కాసేపట్లో KCR పోరుబాట.. సర్వత్రా ఆసక్తి

image

రాజధాని‌లో మాజీ CM KCR పోరుబాట‌కు సర్వం సిద్ధమైంది. మల్కాజిగిరి BRS MP అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా‌ దుండిగల్‌ కమాన్‌ వద్ద ప్రచార సభ ఏర్పాటు చేయగా.. కాసేపట్లో KCR రానున్నారు. CM రేవంత్ సిట్టింగ్(MP) స్థానం‌ ఇదే కావడంతో అందరిచూపు మల్కాజిగిరి‌పై పడింది. దీనికితోడు BRS నుంచి‌ బయటకెళ్లిన ఈటల(BJP), సునీత‌(INC) ప్రత్యర్థులుగా ఉన్నారు. వారిపై KCR స్పందన ఏంటనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

News May 8, 2024

HYD: కాసేపట్లో KCR పోరుబాట.. సర్వత్రా ఆసక్తి

image

రాజధాని‌లో మాజీ CM KCR పోరుబాట‌కు సర్వం సిద్ధమైంది. మల్కాజిగిరి BRS MP అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా‌ దుండిగల్‌ కమాన్‌ వద్ద ప్రచార సభ ఏర్పాటు చేయగా.. కాసేపట్లో KCR రానున్నారు. CM రేవంత్ సిట్టింగ్(MP) స్థానం‌ ఇదే కావడంతో అందరిచూపు మల్కాజిగిరి‌పై పడింది. దీనికితోడు BRS నుంచి‌ బయటకెళ్లిన ఈటల(BJP), సునీత‌(INC) ప్రత్యర్థులుగా ఉన్నారు. వారిపై KCR స్పందన ఏంటనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

News May 8, 2024

కేంద్రంలో మోదీ అరాచక పాలన సాగిస్తున్నారు: రేణుకా చౌదరి

image

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోదీ అరాచక పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి విమర్శించారు. బుధవారం నగరంలోని శ్రీశ్రీ హోటల్‌లో జరిగిన ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి హాజరై ప్రసంగించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు.

News May 8, 2024

జగిత్యాల: సివిల్ సప్లై కమిషనర్‌ను కలిసిన ఎస్పీ

image

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన కోసం బుధవారం జగిత్యాల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను బుధవారం జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. గతంలో డిఎస్ చౌహన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు.