Telangana

News May 8, 2024

అద్దంకి దయాకర్‌పై కేసు నమోదు

image

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అద్దంకి దయాకర్.. రాముడు, సీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మోకిలా PSలో తాము అద్దంకి దయాకర్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకటేశ్, రాజచంద్ర, యాదయ్య, కృష్ణ, హరినాథ్, లింగం, కర్ణాకర్ చారి, కృష్ణ ఉన్నారు.

News May 8, 2024

వరంగల్: చిన్నారిని ముద్దాడిన ప్రధాని మోదీ

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో మామునూర్‌లో భారీ జన సభ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తకు చెందిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ చిన్నారిని ప్రధాని ఆప్యాయంగా ముద్దాడారు.

News May 8, 2024

ఆస్ట్రేలియాలో ఇంద్రవెల్లి వ్యాపారి మృతి

image

ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి జన్నావార్ కిషోర్ (68) ఆస్ట్రేలియాలో మృతి చెందారు. జిల్లాలోని వ్యాపార ప్రముఖుల్లో ఒకరైన కిషోర్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ సిటీలో మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న కొడుకు వద్దకు ఇటీవల వెళ్లిన ఆయన అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు.

News May 8, 2024

HYD: BRS గెలిచేలా KTR వ్యూహాలు..!

image

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో BRSను గెలిపించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. నేడు KCR బస్సు యాత్ర కూడా నగరానికి చేరనుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచేలా నేతలకు KTR సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో HYDలో 17 సీట్లను BRS గెలవగా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.

News May 8, 2024

MBNR: ఎన్నికల ప్రచారం.. ఆసక్తిగా గమనిస్తున్న ఓటర్లు !

image

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభ్యర్థులు, వారి తరఫు నాయకులు చేస్తున్న ప్రచారాలను ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబితే విని ఓట్లు వేసే పరిస్థితిలో లేకుండా పోతున్నాయి. అందరికీ జై అంటున్నారు. కానీ ఓటు ఎవరికి వేస్తారు అన్నది బయటపడడం లేదు. అటూ అభ్యర్థుల ప్రచారాల్లో కొన్ని మార్పులుచేర్పులు చేస్తూ సాగుతున్నాయి.

News May 8, 2024

HYD: BRS గెలిచేలా KTR వ్యూహాలు..!

image

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో BRSను గెలిపించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. నేడు KCR బస్సు యాత్ర కూడా నగరానికి చేరనుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచేలా నేతలకు KTR సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో HYDలో 17 సీట్లను BRS గెలవగా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.

News May 8, 2024

సోషల్ మీడియా పోస్టులపై నిఘా: నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై నిఘా పెట్టినట్లు నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. వాట్సప్, ఫేస్ బుక్, X, తదితర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ఇతర పార్టీలను కించపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

News May 8, 2024

BRS ప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేసింది: జూపల్లి

image

కొల్లాపూర్ పట్టణంలోని 10 వార్డులో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుని, తీరని అన్యాయం చేసిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకున్నామన్నారు.

News May 8, 2024

జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్ క్లోజ్: మంత్రి కోమటిరెడ్డి

image

జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్ క్లోజ్ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు. కేసీఆర్ బస్సు యాత్రతో వచ్చేది లేదు.. సచ్చేది లేదని ఆయన పేర్కొన్నారు. రాముడి పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పదేండ్లు బీజేపీ అధికారంలో ఉండి.. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

News May 8, 2024

ఎంపీగా గెలిపిస్తే విమానాశ్రయం తెస్తా: తాండ్ర

image

కేంద్ర ప్రభుత్వం వందల పథకాలు అమలు చేస్తుంటే ఆ పథకాలు కొత్తగూడెం ప్రజలకు అందించే నాయకుడు లేరని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తాండ్ర వినోద్ రావు మాట్లాడారు. తాను ఎంపీగా గెలిస్తే కొత్తగూడెం పట్టణానికి విమానాశ్రయం తెస్తానన్నారు. మోడీ లాగే తనకు రాజకీయ వారసులు లేరని, సేవ చేయడం కోసమే వచ్చానని చెప్పారు.