Telangana

News May 8, 2024

HYD: 480 కరెంట్ ఫీడర్ ఏరియాల్లో సమస్యలు..!

image

HYDలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు దాదాపు 480 ఫీడర్ ఏరియాల్లో కరెంట్ సమస్యలు ఏర్పడ్డాయి. నగరంలో 4000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కాస్త రాత్రి ఒక్కసారిగా..1000 మెగావాట్లకు పడిపోయింది. దాదాపుగా 300 ఫీడర్ ఏరియాల్లో అధికారులు మరమ్మతులు చేపట్టి సమస్యలకు చెక్ పెట్టారు. మిగతా ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి 2021లో ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

HYD: అభివృద్ధికి నాకో విజన్ ఉంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

దేశంలోని లోక్‌సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైందని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా, మరికొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేవన్నారు. ఐటీ, రియల్ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తనకో విజన్ ఉందని అన్నారు.

మల్కాజిగిరి మినీ ఇండియా: రాగిడి లక్ష్మారెడ్డి

image

మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇదో మినీ ఇండియా అని, భిన్న ప్రాంతాల వారున్నారన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మెట్రో విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతానని తెలిపారు.

MBNR: ఇంటర్ ఫెయిల్ అయ్యామని.. ఇద్దరు సూసైడ్

image

ఇంటర్ ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. అమరచింత మం. సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో నితీశ్ ఆత్మకూరు సమీపంలో ఉరేసుకున్నాడు. అలాగే తిమ్మాజిపేట మం. ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి ఇంటర్ ఫెయిలైంది. దీంతో 10రోజులుగా దిగాలుగా ఉన్న వైష్ణవి నిన్న ఇంట్లో ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకుంది.

News May 8, 2024

సంగారెడ్డి: ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం

image

ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన BDL పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్‌కు చెందిన వివాహిత, భర్త, మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి పటాన్ చెరు మండలం పాటి గ్రామంలో ఉంటున్నారు. ఈనెల 2న ఆసుపత్రికి అని ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

News May 8, 2024

MBNR: ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..

image

నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండల వేడి మీతో ఉక్కిరి బిక్కిరి అయిన ఉమ్మడి జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం సాయంత్రం జిల్లాలో పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు పని డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. మొన్నటివరకు ఉదయం 10 గంటలకు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయితే బుధవారం ఉదయం 10 గంటలకు 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణం చల్లబడింది.

News May 8, 2024

ADB: భారీ వర్షం.. ఇదీ పరిస్థితి..!

image

జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానకుతోడు పిడుగులు పడటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి రైతాంగానికి వేదన మిగిల్చింది. మంచిర్యాల జిల్లాలో 27 స్తంభాలు, ఒక ట్రాన్స్ ఫార్మర్ నేలకూలడంతో విద్యుత్ శాఖకు రూ. 12 లక్షల నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడి పంట నేలరాలడంతో రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.