Telangana

News May 8, 2024

HYD: అక్కను వేధిస్తున్నాడని బావను చంపాడు..!

image

HYD అల్వాల్‌లో <<13198573>>బావ యుగేంధర్‌(40)ను<<>> బావమరిది సుబ్రహ్మణ్యం హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికుడైన ఎం.యుగేంధర్.. గతంలో పలు నేరారోపణలతో జైలుకెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో భార్య జానకి, కుమార్తెను వేధిస్తున్నాడు. తాగొచ్చి భార్యపై దాడి చేయడంతో ఆమె తన తమ్ముడు సుబ్రహ్మణ్యానికి చెప్పింది. దీంతో అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు.

News May 8, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వేసవి సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వేసవి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 (మంగళవారం) నుంచి వచ్చే నెల 5 (బుధవారం) వరకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 6 గురువారం నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. ఎండల తీవ్రత, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులు గమనించాలన్నారు.

News May 8, 2024

మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ

image

మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన 3రోజుల నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్​లో ఆయన నివాసంలోనే రెస్ట్​ తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఎంపీ అభ్యర్థి రఘువీర్​రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి​ అలసటగా ఉందని ప్రచారం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ​ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News May 8, 2024

కామారెడ్డి: ఈనెల 11న ప్రియాంకా గాంధీ

image

కామారెడ్డి జిల్లాకు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 11న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News May 8, 2024

HYD: అక్కను వేధిస్తున్నాడని బావను చంపాడు..!

image

HYD అల్వాల్‌లో <<13198573>>బావ యుగేంధర్‌(40)ను<<>> బావమరిది సుబ్రహ్మణ్యం హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికుడైన ఎం.యుగేంధర్.. గతంలో పలు నేరారోపణలతో జైలుకెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో భార్య జానకి, కుమార్తెను వేధిస్తున్నాడు. తాగొచ్చి భార్యపై దాడి చేయడంతో ఆమె తన తమ్ముడు సుబ్రహ్మణ్యానికి చెప్పింది. దీంతో అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు.

News May 8, 2024

HYD: వర్షం పరిస్థితులపై కమిషనర్ సమీక్ష

image

HYDలో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షం పరిస్థితులపై కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులతో సమీక్షించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌కి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 75 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచినట్లు అధికారులు గుర్తించారు.

HYDలో చలివేంద్రాలు పెంపు: జలమండలి ఎండీ

image

ఎండలు తీవ్రంగా ఉండటంతో బాటసారులు, పౌరులకు చల్లటి తాగునీరందించేలా నగరవ్యాప్తంగా చలివేంద్రాల సంఖ్య పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు, రానున్న వర్షాకాలానికి కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి సరఫరా, ట్యాంకర్ల నిర్వహణ, వినియోగదారుల ఫిర్యాదులపై ఆరా తీశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది దృష్టి సారించాలన్నారు.

HYD: అభివృద్ధి చేసిన BRSను ఆదరించండి: MLA

image

సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మర్యాదపూర్వకంగానే కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను BRSలో సంతృప్తిగా ఉన్నాననన్నారు. బీసీలకు ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఇచ్చిన BRSను ఆదరించాలన్నారు.