Telangana

News May 8, 2024

HYD: అభివృద్ధి చేసిన BRSను ఆదరించండి: MLA

image

సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మర్యాదపూర్వకంగానే కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను BRSలో సంతృప్తిగా ఉన్నాననన్నారు. బీసీలకు ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఇచ్చిన BRSను ఆదరించాలన్నారు.

జీహెచ్ఎంసీని సందర్శించిన శిక్షణ ఐఏఎస్‌లు

image

నగరాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ అవలంబిస్తున్న పథకాలను కమిషనర్ రోనాల్డ్ రాస్ శిక్షణ ఐఏఎస్‌లకు వివరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెమోగ్రఫీ, శానిటేషన్, చెత్త సేకరణ, డిస్పోజల్, సీ అండ్ డీ అడ్మినిస్ట్రేషన్, ఆస్తి పన్ను వసూలు తదితర పథకాలను ఆయన వివరించారు. సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, అదనపు కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శిక్షణ ఐఏఎస్‌లు పాల్గొన్నారు.

UPDATE.. లారీని తప్పించబోయి బస్సు బోల్తా !

image

హైవే-165పై అడ్డాకుల సమీపంలో స్నేహ కంపెనీ వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న <<13204316>>బస్సు బోల్తా<<>> పడింది. ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా.. వారిలో మియాపూర్‌కు చెందిన వంశీ, బెంగళూరుకు చెందిన ప్రజ్ఞా పరిమిత పరిస్థితి విషమంగా ఉంది. అడ్డాకుల పోలీసులు వెంటనే క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ఉన్నారు. లారీని తప్పించబోయి బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది.

News May 8, 2024

కరీంనగర్: తారాస్థాయికి ప్రచారం!

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇంకా 3 రోజులే సమయం ఉండటంతో ప్రజలతో మమేకమవడం అభ్యర్థులకు కష్టంగా మారింది. KNR, PDPL లోక్‌సభ పరిధిలో 33.93 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా, సర్వే ఏజెన్సీలపై ఆధారపడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థుల వాయిస్‌లతో ఓటర్లకు సందేశాలు పంపిస్తున్నారు. ‘హలో.. మీ ఓటు ఎవరికీ?’ అని ఫోన్ చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

News May 8, 2024

HYD: రూ.91.64 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

image

వయోధికుడి నుంచి రూ.91.64 లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన 74 ఏళ్ల వయోధికుడికి ఫెడెక్స్ కొరియర్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీకు వచ్చిన పార్సెల్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే తమకు డబ్బు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భయపడ్డ వయోధికుడు రూ.91.64లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు.

MBNR-13,221, NGKL-8,465 మంది ఓటర్ల తొలగింపు

image

ఉమ్మడి జిల్లాలో చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగిస్తూ తుది జాబితాను విడుదల చేశారు. MBNR లోక్ సభ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మంది ఓట్లు తీసేశారు. NGKL లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు.

News May 8, 2024

వరంగల్: అకాల వర్షం.. రైతన్న ఆగమాగం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కుండపోత వాన పడటంతో మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఎక్కడికక్కడ ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు పశువులు మృత్యువాత పడ్డాయి.