Telangana

News May 8, 2024

ఖమ్మాన్ని నా కుతూరు లాగా జాగ్రత్తగా చూసుకుంటాడు: వెంకటేశ్

image

రఘురాంరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం ప్రజలను తన కుతూరు లాగా జాగ్రత్తగా చూసుకుంటారని సినీ హీరో వెంకటేశ్ అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైనవారు డైలాగ్‌ చెప్పాలని కోరగా, ‘డైలాగ్‌లు సినిమాలకే పరిమితం. ఇప్పుడంతా ఒకటే డైలాగ్‌. 13న పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి. రఘురాం రెడ్డికి ఓటెయ్యాలి. అంతే..!’ అని తనదైన శైలిలో చెప్పారు

News May 8, 2024

వనపర్తి: మే 8న సాయంత్రం 5 లోగా ఓటు వేయాలి: అదనపు కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికలకు ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు మే 8న సాయంత్రం 5 గంటల లోపు IDOC లోని ఫేసిలీటేశన్ సెంటర్ లో ఓటు వేయాలని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి యం నగేష్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలట్ కొరకు ఇదివరకే ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు రేపు సాయంత్రంలోగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

News May 8, 2024

HYD: 48 శాతం మహిళా ఓటర్లే.. పార్టీల ఫోకస్!

image

HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో కలిపి ఏకంగా 53,80,594 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,10,36,044 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో ఇతరులు 1138 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 51 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. 48 శాతం మహిళా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వారిని ఆకట్టుకునేలా ప్రచారాలు చేస్తున్నారు.

Respect: హైదరాబాద్‌‌లో మీ సేవలకు సలాం

image

అకాల వర్షం రాజధానిని అతలాకుతలం చేసింది. సాయంత్రం మొదలైన గాలివాన మిడ్‌నైట్ వరకు ముప్పుతిప్పలు పెట్టింది. విరిగి పడుతున్న చెట్ల కొమ్మలు, పొంగుతున్న మ్యాన్‌హోల్స్‌, కిలో మీటర్ల‌ మేర ట్రాఫిక్‌ జామ్‌ను దాటి ఎట్టకేలకు ఇళ్లకు చేరిన ఉద్యోగుల బాధ వర్ణణాతీతం. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో GHMC సిబ్బంది, HYD ట్రాఫిక్ పోలీసులు‌ ఎంతో కష్టపడ్డారు. భారీ వర్షంలో తడుస్తూనే వరదను నాలాలకు మళ్లించారు. మీ సేవలకు సలాం.

KMR: మాజీ సీఎం KCR రోడ్ షోతో BRSలో హుషారు

image

BRS అధినేత, మాజీ సీఎం KCR రోడ్ షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ZHB లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన రోడ్ షో, బస్సు యాత్ర పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఆయన ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ముగిసే వరకు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

News May 8, 2024

ADB: కంట్రోల్ యూనిట్స్ సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి

image

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌‌లకు సంబంధించిన కంట్రోల్ యూనిట్స్ సప్లమెంటరీ సెకండ్ ర్యాండమైజేషన్‌ను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.

News May 8, 2024

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి:కలెక్టర్ 

image

ఖమ్మం: జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడిఓలు, మునిసిపల్ కమీషనర్లు, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీర్లతో త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా అధికారులు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

News May 8, 2024

గద్వాల:పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలి: జిల్లా ఎన్నికల అధికారి

image

గద్వాల: ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సంతోష్ పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందికి స్థానిక MLD ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా నిబంధనలు పాటిస్తూ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు.