Telangana

News May 8, 2024

మెదక్ : రైతులు జాగ్రత్తలు వహించాలి: అదనపు కలెక్టర్

image

రానున్న 3 రోజుల అకాల వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులు తడవకుండా భద్రపరచాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో కప్పి ఉంచాలన్నారు. అనంతరం పీపీసీ కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లకు, రైతులకు ధాన్యం తడవకుండా చేపట్టాల్సిన చర్యలపై పలుసూచనలు చేశారు.

News May 8, 2024

ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే చర్యలు:ఎస్పీ చందన దీప్తి

image

NLG:పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు,మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పి చందనా దీప్తి హెచ్చరించారు.జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లను ప్రభావితం చేస్తే చర్యలు తప్పమన్నారు.

News May 7, 2024

షాద్‌నగర్‌‌లో రేపు అస్సాం ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం

image

షాద్‌నగర్ నియోజకవర్గంలో రేపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అందే బాబయ్య తెలిపారు. షాద్‌నగర్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు ఉదయం 8 గంటలకు కేశంపేట మండలంలోని ఇప్పలపల్లిలో ప్రారంభమై కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్, నందిగామ తదితర గ్రామాలలో సీఎం ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని తెలిపారు.

News May 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

▶ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
▶NRPT:BRSకు నలుగురు కౌన్సిలర్ల రాజీనామా
▶EVM స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన అధికారులు
▶MP ఎన్నికలు.. ప్రచారంలో స్పీడ్ పెంచిన జిల్లా నేతలు
▶దళితుడిని మంత్రిని చేసిన ఘనత మోదీది:మందకృష్ణ
▶జిల్లాలో పలుచోట్ల ఉపాధి కూలీలకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలు
▶కొల్లాపూర్:KCR గడీలో.. RSP బందీ: మంత్రి జూపల్లి
▶కొత్తపల్లి:బోనులో చిక్కిన చిరుత

News May 7, 2024

ఉద్యమంలో పోరాటం చేసిన గడ్డ కామారెడ్డి: KCR

image

తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ కామారెడ్డి అని మాజీ సీఎం KCR అన్నారు. కామారెడ్డిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆనాడు కష్టపడి అనేక ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. BRS పాలనలో రాష్ట్రాన్ని పొదరిల్లులా చేసుకున్నామని పేర్కొన్నారు. ఇదే కామారెడ్డిలో పోలీస్ కిష్టయ్య పిస్టల్‌తో కాల్చుకుని అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.

News May 7, 2024

రేపటి నుంచి పాలమూరులో భారీవర్షాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే సోమవారం రాత్రి ఈదురుగాలులతో పలుచోట్ల వాన జల్లులు కురిసాయి. దీంతో ప్రజలు ఎండలతో ఉపశమనం కలిగింది. మంగళవారం(నేడు) ఎండ తీవ్రత తగ్గింది.

News May 7, 2024

ఉమ్మడి జిల్లాలో పల్లెల్లో కనిపించని ప్రచారం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో హోరెత్తిన ప్రచారం ఇప్పుడు కనిపించడం లేదు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సందడిగా లేదు. మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 11తో) ఎంపి ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో గ్రామాలు ఉండడం, మండుటెండల కారణంగా అన్ని గ్రామాలకు వెళ్లడం సాధ్యం కావడం లేదని నేతలు పేర్కొంటున్నారు.

News May 7, 2024

ఖమ్మంలో రఘురాం రెడ్డి గెలుపు ఖాయం: సినీ హీరో వెంకటేష్

image

ఈవీఎంలో మూడో నెంబర్ గుర్తుందా.. అదేనండీ మన గుర్తు అంటూ.. మంగళవారం ఖమ్మం నగరంలో జరిగిన రోడ్డు షోలో సినీ హీరో వెంకటేష్ అన్నారు. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు గెలుపు ఖాయమన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మన RRRకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోడ్డు షోలో మంత్రి పొంగులేటి ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

News May 7, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాలో 1,557 కేసులు

image

పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అప్పటినుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,557 కేసులు నమోదు చేసి, 683 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. రూ. 8.89 కోట్ల విలువైన అక్రమ మద్యం, కల్లు, నాటుసారా, గంజాయి తదితర పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈమధ్య పటాన్ చెరులో రూ. 9.23 కోట్ల విలువచేసే ఎంఎంసీ మత్తు పదార్థం సీజ్ చేశామన్నారు

News May 7, 2024

పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.