Telangana

News April 4, 2025

CCI పునరుద్ధరణపై లోక్‌సభలో మాట్లాడుతా: NZB MP

image

ADBలో సీసీఐ ఫ్యాక్టరీ రీఓపెన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను CCI సాధన కమిటీ సభ్యులు కోరారు. న్యూ ఢిల్లీ కొత్త పార్లమెంట్ భవన్‌లో ఎంపీ అర్వింద్‌ని గురువారం సభ్యులు కలిసి విన్నవించారు. వారి న్యాయమైన డిమాండ్ గురించి కచ్చితంగా పార్లమెంట్‌లో మాట్లాడుతానని ఎంపీ హామీ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.

News April 4, 2025

మహబూబ్‌నగర్: ఏప్రిల్ 14లోపు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ 

image

రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో స్పెషల్ అధికారులు, బ్యాంకర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అర్హులకు రూ.50 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు రుణం మంజూరు చేస్తామన్నారు. అర్హులైన వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 4, 2025

‘మహబూబ్‌నగర్ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం’

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

News April 4, 2025

ఉట్నూర్: గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు

image

గిరిజన గురుకుల పాఠశాల పీవీటీజీ బాలుర ఆసిఫాబాద్లో 2025-26 విద్యా సంవత్సరానికి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సీట్లు మిగిలాయి. వీటి భర్తీకి ఆదిమ గిరిజన తెగలకు చెందిన కొలాం, తోటి విద్యార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్త, ఆర్సీఓ అగస్టీన్ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ASFలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈనెల 9 నుంచి 30 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 4, 2025

ADB: ‘జిల్లాలో 27,432 మందికి రుణమాఫీ కాలే’

image

రుణమాఫీ కాలేక రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు స్వరాజ వేదిక జిల్లాధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. జిల్లాలో 27,432 మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. గురువారం బోథ్‌లో ఆయన మాట్లాడారు. అటు రైతు భరోసా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, రైతు భరోసా కల్పించాలని కోరారు. రైతులు రామ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

News April 4, 2025

కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసిన మంత్రి పొన్నం బృందం

image

కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, BC ఎమ్మెల్యేలలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని గురువారం వీరేంద్ర కుమార్‌ను మంత్రి కోరారు.

News April 4, 2025

ఖమ్మంలో నేడు మంత్రి తుమ్మల పర్యటన

image

మంత్రి తుమ్మల నాగేశ్వరావు శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మేయర్ పునకోల్లు నీరజతో కలిసి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.

News April 4, 2025

ADB: ఈ నెల 5న జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

image

బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌక్‌లో ఈ నెల 5న ఉదయం 9.00 గంటలకు ఉంటుందని కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. బహిరంగ సభ STU భవన్‌లో 9.20 గంటలకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News April 4, 2025

ఆదిలాబాద్ డీఈవోగా శ్రీనివాస్‌రెడ్డి

image

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గతంలో డీఈవోగా పనిచేసిన టి.ప్రణీత పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే.

News April 4, 2025

ADB: రెన్యువల్ కాని మందు బార్లకు నోటిఫికేషన్

image

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రెన్యువల్ కాని మందు బార్లకు నోటిఫికేషన్ వెలువడిందని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి హిమశ్రీ తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 26 లోపు దరఖాస్తుల సమర్పించాలని దరఖాస్తు చేసుకునేవారు రూ.లక్ష డీడీ లేదా చలాన్ గాని District Probation and Excise officer పేరిట తీసి, 3 పాస్ ఫోటో, ఆధార్ లేదా పాన్ కార్డులతో దరఖాస్తుల సమర్పించలాన్నారు. వివరాలకు 8712658771 సంప్రదించాలని కోరారు.