Telangana

News May 7, 2024

కుకునూర్‌పల్లిలో పిడుగుపాటుకు యువకుడు మృతి

image

పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన కుకునూర్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుకునూర్‌పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. కుకునూర్‌పల్లికి చెందిన కుమ్మరి మల్లేశం(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనుల నిమిత్తం వ్యవసాయం బావి దగ్గరకి వెళ్లాడు. అప్పుడే ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగుపడింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు.

News May 7, 2024

WGL: పట్టభద్రుల ఎన్నికకు 22 మంది నామినేషన్

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 22కు చేరిందని అధికారులు తెలిపారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BRS నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

News May 7, 2024

NLG: రవాణా చెక్ పోస్టులకు మంగళం!?

image

అవినీతి నిలయాలుగా మారాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ప్రభుత్వం త్వరలో ఎత్తివేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖకు 15 చెక్‌పోస్టులు ఉండగా వాటిలో 3 ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. KDD, వాడపల్లి, అద్దంకి- NKP రహదారి, నాగార్జునసాగర్ వద్ద రవాణా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

News May 7, 2024

లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల పరీక్షకు మరో ఆరు రోజులే..!

image

KMM, MHBD పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల పరీక్షకు మరో 6 రోజులే ఉన్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తీరిక లేకుండా ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు విక్టరీ వెంకటేష్ రావడంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. అటు నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.

News May 7, 2024

గుండె పోటుతో మాజీ సర్పంచ్ మృతి.. ఎర్రబెల్లి కంట తడి

image

రాయపర్తి మండలం బంధన్‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్ చెవ్వ సంపత్ మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. వారి పార్థివ దేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలవేసి నివాళులర్పించి, కన్నీటి పర్యంతయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. సంపత్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.

News May 7, 2024

శివంపేట: వడదెబ్బతో ఉపాధికూలీ మృతి

image

శివంపేట మండలం కొంతాన్‌ పల్లి గ్రామానికి చెందిన కలకుంట లక్ష్మీ (45) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం ఉపాధిహామీ పథకం కింద నిర్వహిస్తున్న పనుల వద్దకు పనులు చేసేందుకు వెళ్లింది. కూలీలతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయింది. గ్రామంలోని వైద్యుడికి చూపించగా మృతిచెందినట్లు తెలిపారు.

News May 7, 2024

వామ్మో.. 14 యూనిట్లకు రూ.60,701 కరెంటు బిల్లు!

image

మండుటెండలకు చెమటలు పట్టుడు ఏమో కాని ఈ కరెంట్ బిల్లు చూస్తే మాత్రం ముచ్చెమటలు పడతాయి. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఓ షాప్ యజమానికి కరెంట్ బిల్లు చూడగానే షాక్ తగిలింది. తన షాపునకు ప్రతి నెల రూ.200 బిల్లు రాగా, ఇప్పుడు కేవలం 14 యూనిట్లకు ఏకంగా రూ.60,701 బిల్లు వచ్చిందని వాపోయారు. అధికారులు స్పందించాలని కోరారు.

News May 7, 2024

హైదరాబాద్‌కు పూర్వ వైభవం తెస్తా: CM రేవంత్ రెడ్డి

image

రాజధాని‌లోని 4 స్థానాలపై‌ CM రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నిన్న ఉప్పల్, అంబర్‌పేట, కంటోన్మెంట్‌లో రోడ్‌షో‌లు నిర్వహించారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ తాజాగా ఆయన ట్వీట్ చేశారు. ‘నగరం నమ్మకం పెట్టుకుంది. గల్లి గల్లీల గజమాలలతో స్వాగతం చెప్పింది. అంబర్‌పేట సంబురమైంది. కంటోన్మెంట్ కోలాటమాడింది. మాట ఇస్తున్నా. మన నగరానికి పూర్వవైభవం తెస్తా. బస్తీల ముఖచిత్రం మారుస్తా’ అంటూ పేర్కొన్నారు.

News May 7, 2024

హైదరాబాద్‌కు పూర్వ వైభవం తెస్తా: CM రేవంత్ రెడ్డి

image

రాజధాని‌లోని 4 స్థానాలపై‌ CM రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నిన్న ఉప్పల్, అంబర్‌పేట, కంటోన్మెంట్‌లో రోడ్‌షో‌లు నిర్వహించారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ తాజాగా ఆయన ట్వీట్ చేశారు. ‘నగరం నమ్మకం పెట్టుకుంది. గల్లి గల్లీల గజమాలలతో స్వాగతం చెప్పింది. అంబర్‌పేట సంబురమైంది. కంటోన్మెంట్ కోలాటమాడింది. మాట ఇస్తున్నా. మన నగరానికి పూర్వవైభవం తెస్తా. బస్తీల ముఖచిత్రం మారుస్తా’ అంటూ పేర్కొన్నారు.

News May 7, 2024

MBNR: ఓటింగును అడ్డుకుంటే మూడేళ్ల జైలు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బూత్ క్యాప్చరింగ్, ఈవీఎంలను ధ్వంసం చేయడం, బ్యాలెట్ పేపర్లను స్వాధీనం చేసుకోవడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం తదితర చర్యలకు పాల్పడితే ఐపిసి సెక్షన్ 135ఏ, 136 ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా విధించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.