Telangana

News May 7, 2024

కరీంనగర్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

ఆన్లైన్ గేమ్‌లతో డబ్బులు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర మండలం మధురానగర్‌కు చెందిన లక్ష్మణ్- లక్ష్మి కుమారుడు పృథ్వీ (25) నోయిడా(UP)లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడు స్నేహితుల వద్ద రూ.12 లక్షల అప్పు చేసి ఆన్లైన్ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. ఆ అప్పు ఎలా తీర్చాలనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2024

వరంగల్: జాగ్రత్తలు తీసుకుంటేనే ఓటు చెల్లుబాటు..!

image

ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1,445 తిరస్కరణకు గురయ్యాయి. అందులో నర్సంపేటలో అత్యధికంగా 278 ఉన్నాయి. సరిగా సంతకాలు చేయకపోవడంతో పాటు పలు కారణాలతో చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలకు గాను రేపటి వరకు ఈ ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

News May 7, 2024

ఆదిలాబాద్: రూ.2తో ఓటు ఛాలెంజ్‌

image

పోలింగ్‌ బూత్‌లోకి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోదని అనుమానం కలిగినప్పుడు ఏజెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారికి రూ.2 చెల్లించి సవాల్‌ చేసే అవకాశం ఉంది. ఓటరు బోగస్‌ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. జాబితాలో ఉన్న విధంగా ఓటరే అయితే ఓటు వేయడానికి అనుమతిచ్చి, సవాల్‌ చేసిన ఏజెంట్‌ ఓడిపోయినట్లు తీర్మానించి అతను చెల్లించిన రూ.2ను ప్రభుత్వానికి అప్పగిస్తారు.

News May 7, 2024

NZB: ఎంపీగా ఓడిపోయారు..MLAగా గెలిచారు

image

ఉమ్మడి NZB జిల్లాలో కొంతమంది నాయకులు MPగా పోటీ చేసి ఓడిపోగా తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి 1989లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 1994లో MLA గ గెలుపొందారు. 2009లో బిగాల గణేశ్ గుప్తా NZB ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 2019లో ZHB ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 2023 ఎన్నికల్లో MLAగా గెలుపొందారు.

News May 7, 2024

HYD: మరింత మెరుగ్గా పోల్ క్యూ రూట్ యాప్

image

పోల్ క్యూ రూట్ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

News May 7, 2024

HYD: మరింత మెరుగ్గా పోల్ క్యూ రూట్ యాప్

image

పోల్ క్యూ రూట్ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

News May 7, 2024

ఖమ్మం: వడగండ్లు మిగిల్చిన కడగండ్లు

image

ఖమ్మం జిల్లాలో వడగండ్ల వాన రైతన్నలను ముంచేసింది. అకాల వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు వడగండ్ల దాటికి దెబ్బతిన్నాయి. ఐకేపీ కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News May 7, 2024

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

image

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

News May 7, 2024

NLG: ‘వందే భారత్’ కింద పడి చనిపోయాడు..! 

image

వందే భారత్ రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. భువనగిరి-పగిడిపల్లి రైల్వే లైన్ మధ్యలో పట్టాలపై వందే భారత్ రైలు కింద పడి రాత్రి ఓ గుర్తుతెలియని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు సుమారు 35 ఏళ్లు ఉంటాడని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8712568454, 8712658719 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 7, 2024

కేసముద్రం మార్కెట్‌కు 7 రోజుల సెలవు

image

కేసముద్రం మార్కెట్‌కు ఈ నెల 8 నుంచి 14 వరకు 7 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమర లింగేశ్వర రావు తెలిపారు.
*8-05-2024 అమావాస్య
*9-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)
*10-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)
*11-05-2024 (వారాంతపు సెలవు)
*12-05-2024 (ఆదివారం)
*13-05-2024 ( ఎంపీ ఎన్నికల సందర్భంగా)
*14-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)