Telangana

News May 7, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో వాహన తనిఖీలు.. నగదు పట్టివేత

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 20,18,600 నగదు పట్టుబడ్డాయి. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 14,62,000 నగదు లభించింది. బేగంపేటలో రూ.2 లక్షలు, గజ్వేల్‌లో 1,22,500 లు, టేక్మాల్‌లో రూ. 1,21,700 లు, చిన్నకోడూరు రూ. 1,11,400 లు నగదు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ నగదును సీజ్ చేశారు.

News May 7, 2024

HYD: అనుమానంతో భార్య దారుణ హత్య

image

అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు గచ్చిబౌలి సమీపంలోని మోకిలా PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీర్జాగూడ పరిధి ఇంద్రారెడ్డి నగర్‌లో వడ్డే మాణిక్యం, యాదమ్మ(45) దంపతులు కూలి పని చేసుకుంటూ జీవించేవారు. కొన్ని రోజులుగా యాదమ్మను అనుమానిస్తూ మాణిక్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో యాదమ్మ రాత్రి ఇంటి బయట నిద్రించగా ఆమె తలపై బండరాయితో మోది మాణిక్యం చంపేశాడు.

News May 7, 2024

NLG: మంత్రాల నెపంతో వృద్ధురాలి హత్య

image

మంత్రాల నెపంతో వృద్దురాలిని హత్య చేసిన ఘటన అనంతగిరి మండలంలో చోటు చేసుకుంది. SI అజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. నడిగూడేం PS పరిధిలోని త్రిపురవరం‌ గ్రామానికి చెందిన కొమ్ము అలివేలు పశువుల కాపరిగా జీవనం సాగిస్తోంది. ఆమెకు మంత్రాలు వస్తాయనే అనుమానంతో గ్రామానికి చెందిన హుస్సేన్ మరో వ్యక్తితో కలిసి మెడకు తాడు బిగించి హత్య చేసినట్లు మనువడు సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు SI తెలిపారు.

News May 7, 2024

HYD: అనుమానంతో భార్య దారుణ హత్య 

image

అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు గచ్చిబౌలి సమీపంలోని మోకిలా PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీర్జాగూడ పరిధి ఇంద్రారెడ్డి నగర్‌లో వడ్డే మాణిక్యం, యాదమ్మ(45) దంపతులు కూలి పని చేసుకుంటూ జీవించేవారు. కొన్ని రోజులుగా యాదమ్మను అనుమానిస్తూ మాణిక్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో యాదమ్మ రాత్రి ఇంటి బయట నిద్రించగా ఆమె తలపై బండరాయితో మోది మాణిక్యం చంపేశాడు. 

News May 7, 2024

కామారెడ్డికి రేవంత్, KCR, ప్రియాంక

image

కామారెడ్డి జిల్లాలో అగ్రనేతల ప్రచారం కొనసాగనుంది. నేడు కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన కేసీఆర్.. బస్సు యాత్రతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 10న కామారెడ్డిలో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు.

News May 7, 2024

ఆదిలాబాద్: రెండు నెలల్లో 27 మంది దుర్మరణం

image

ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో 2 నెలల్లోనే 71 ప్రమాదాలు చోటుచేసుకోగా 27 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 48 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగొంది, దేవాపూర్ చెక్ పోస్టు, మావల బైపాస్ వద్ద, నేరడిగొండ మండలం బోరిగాం, కుప్టి ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ప్రమాదాల్లో యువకులే మృత్యవాత పడుతున్నారు.

News May 7, 2024

MBNR: ఇంకా ఐదు రోజులు మాత్రమే!

image

లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్ సభ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈనెల 13న పోలింగ్ నిర్వహించనుండగా, 11న సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. MBNR, NGKL నియోజకవర్గాల్లో పెద్ద పట్టణాలు, పెద్ద గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యనేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

News May 7, 2024

నేడు నర్సాపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సాపూర్‌కు వస్తున్నారని నియోజకవర్గ ఇన్చార్జ్ రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ నర్సాపూర్ పర్యటన రద్దయిందని వారు తెలిపారు.

News May 7, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు VHP, బజరంగ్‌దళ్ డిమాండ్

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అయోధ్య అక్షింతలపై అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ డిమాండ్ చేశాయి. ఈ మేరకు HYDలో ఓ ప్రకటన విడుదల చేశాయి. హిందూ దేవుళ్లను కించపరిచేలా సీఎం మాట్లాడడం సరికాదని పేర్కొన్నాయి. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 8న HYD, ఉమ్మడి RRతో పాటు అన్ని జిల్లాల్లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి.