Telangana

News May 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. దిగ్వాల్ 45.9, నాగపూర్ 45.5, సిద్దిపేట 45.4, రేగోడు, చిట్యాల 45.2, పోడ్చన్ పల్లి 45.1, రేబర్తి, లకుడారం 45.0, ఆరంజ్ అలర్ట్ దూల్మిట్ట 44.9, తుక్కాపూర్, కిష్టారెడ్డిపేట 44.8, రాఘవాపూర్, మెదక్, కొల్చారం 44.6, కల్హేర్, బెజ్జంకి 44.5, పాతూరు, దామరంచ, హుస్నాబాద్, ప్రగతి ధర్మారం 44.2 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 6, 2024

రేపు మెదక్‌లో కేసీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి మెదక్ పట్టణంలో నిర్వహించే ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, శశిధర్ రెడ్డిలు పాల్గొంటారు.

News May 6, 2024

కడ్తాల్: ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య

image

ప్రియుడితో భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కడ్తాల్ మండలంలోని మక్త మాదారం గ్రామ సమీపంలోని బట్టర్ ఫ్లై సిటీ వెంచర్‌లో గత నెల 30న గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాదులోని నాదర్‌గూల్‌కు చెందిన తాండ్ర రవీందర్ (45)ను అతని భార్య గీత ప్రియుడు యాదగిరి అనే వ్యక్తితో హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

News May 6, 2024

5వ రోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

image

NLG- KMM- WGL పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5వ రోజు సోమవారం 13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టపద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జికి వీరు నామినేషన్లను సమర్పించారు.

News May 6, 2024

తులం బంగారం తుస్సుమంది: పువ్వాడ

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీలన్నీ అటకెక్కాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని గట్టయ్య సెంటర్లో నిర్వహించిన మీటింగ్‌‌‌లో మాట్లాడారు.’తులం బంగారం తుస్సు మనే.. కళ్యాణ లక్ష్మీ బుస్సుమనే’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.  ఐదు నెలల్లో అన్ని సంక్షేమ పథకాలు గాల్లోకి వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో నామాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

News May 6, 2024

MHBD: తల్లి గెలుపు కోసం తట్ట ఎత్తిన కూతురు

image

మహబూబాబాద్ మండలం ఇస్లావత్ తండాలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇందులో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కవిత కూతురు మహతి ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి, తన తల్లికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కవిత కూతురు మహతి మట్టి తట్ట నెత్తిన పెట్టుకొని కాసేపు ముచ్చటించారు.

News May 6, 2024

జన్నారం: పొదల్లో ఆడ శిశువు లభ్యం

image

మానవత్వాన్ని మంటగలిపే ఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేశారు. అటుగా వెళ్తున్న ప్రవీణ్ శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన బ్లూ కోట్ పోలీసులు హుటాహుటిన శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News May 6, 2024

సిద్దిపేట: వాహనాల తనిఖీల్లో రూ.14,62,000 పట్టివేత

image

సిద్దిపేట వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తన సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టణానికి చెందిన యం.రమేష్ తన మోటార్ సైకిల్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళుతున్న రూ.8,62,000/- సీజ్ చేశారు. చౌడారం గ్రామానికి చెందిన రాములు తన వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.6 లక్షలు తీసుకువెళ్తుండగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ లక్ష్మీబాబు తెలిపారు.

News May 6, 2024

కామారెడ్డి: ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి ద్వితియ శ్రేణి మెజిస్ట్రేట్ ప్రతాప్ తీర్పునిచ్చారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహమ్మద్ యూనిస్, కోన గణేశ్ పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచనట్లు పోలీసులు తెలిపారు. వారికి న్యాయస్థానం 2రోజుల జైలు శిక్షతో పాటు రూ.200 చొప్పున జరిమానా విధించింది.

News May 6, 2024

NGKL: వైద్యం వికటించి.. ఓ వ్యక్తి మృతి

image

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన NGKL జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గౌరారం గ్రామానికి చెందిన చిన్న రాములు (38) అనారోగ్యం కావడంతో తెలకపల్లిలో ఓ ప్రైవేటు వైద్యుడి దగ్గరికి వెళ్లాడు. ఆ వైద్యుడు టైఫాయిడ్ వచ్చిందని ఇంజక్షన్ ఇచ్చి, సెలైన్ పెట్టాడు. ఆ వైద్యం వికటించి మరణించాడు. వైద్యుడిపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.