Telangana

News May 6, 2024

ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపనలు:డిప్యూటీ సీఎం

image

ఖమ్మం: సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న పేదింటి ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News May 6, 2024

REWIND: మహబూబ్‌నగర్ హ్యాట్రిక్ ఎంపీలు వీరే..

image

మహబూబ్‌నగర్ పార్లమెంటులో ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1957లో వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వర్‌రావు ఎంపీగా గెలిచారు. తిరిగి 1967, 71, 77లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1980లో మల్లికార్జున్ గెలుపొందగా, తిరిగి 1989, 91, 96లో వరుసగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఈ ఇద్దరు ఎంపీలుగా 4 సార్లు ఎన్నిక కాగా వరుసగా 3సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.

News May 6, 2024

HYD: ‘కాసులుంటేనే సరోజినీ క్యూలైన్‌లో ముందుకు’

image

HYD మెహిదీపట్నంలోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. దీంతో భారీ క్యూ లైన్ ఏర్పడుతుంది. దీన్ని అదునుగా చేసుకొని సెక్యూరిటీ చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్యూ లైన్‌లో చివరలో ఉన్నా.. డబ్బులు ఇస్తే అందరికంటే ముందే స్టాంపు వేయించుకుని వైద్యం పొందవచ్చని రోగులు తెలిపారు. ఆసుపత్రిలో ఉచిత వైద్యమని బోర్డులు పెట్టి, ఇలా చేతివాటం చూపిస్తున్నారని వాపోయారు.

HYDలో బీర్ల కొరత..!

image

కొద్ది రోజులుగా HYDలో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్డ్, లైట్ బీర్లు, టిన్‌లు ఇలా వివిధ రకమైనవి అందుబాటులో లేవని వైన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామని మద్యం ప్రియులు అంటున్నారు. అధికారులు స్పందించి బీర్ల కొరతను అరికట్టాలని కోరుతున్నారు. పలు షాపుల వద్ద నో బీర్లు అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

గుర్రంపోడు మండలం మోసంగికి చెందిన నడ్డి శ్రీను (40) గ్రామ శివారులోని ముత్యాలమ్మ గుడి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News May 6, 2024

HYD: సాయన్న బిడ్డను గెలిపిస్తాం: మల్లారెడ్డి

image

సాయన్న బిడ్డ నివేదితను గెలిపిస్తామని మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి MLA మర్రి రాజశేఖర్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఇన్‌ఛార్జ్ శ్రీధర్, కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదితో కలిసి ఆయన మాట్లాడారు. KCR వైపే ప్రజలు ఉన్నారన్నారు.

నాగర్ కర్నూల్‌లో ఎవరి ధీమా వారిదే.!!

image

NGKL ఎంపీ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJPల అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుందని, పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామని INC అభ్యర్థి మల్లు రవి ప్రచారం చేస్తున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ రావాలని BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ ప్రచారం చేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని BRS అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నారు.