Telangana

News May 6, 2024

నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య

image

నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన నాగయ్య(45)ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి గ్రామ శివారులోకి తీసుకెళ్లి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని తీసుకువచ్చి ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

HYD: ఎండకు పగిలిన కారు అద్దాలు..!

image

HYD, ఉమ్మడి RRలో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోత, వేడి గాలులతో అవస్థలు పడుతున్నారు. దీంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇటీవల యూసుఫ్‌గూడలో ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. తాజాగా చేవెళ్ల పరిధి ఇబ్రహీంపల్లిలో ఎండ వేడికి జాజుగుట్టకు చెందిన అహ్మద్ కారు అద్దాలు పగిలిపోయాయి. మధ్యాహ్నం ఇంటి ముందు కారు పెట్టగా ఎండకి అద్దాలు పగిలిపోయాయని బాధితుడు తెలిపాడు.

రూ.4,500 పెరిగిన టమాటా మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటా రూ.17,100 పలకగా, 341 రకం మిర్చి రూ.16 వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.14 వేలు, 5531 రకం మిర్చికి రూ.12 వేల ధర వచ్చింది. మరోవైపు టమాటా మిర్చి గత వారంతో పోలిస్తే భారీగా పెరిగింది. గతం శుక్రవారం రూ. 31 వేల ధర పలికిన టమాటా మిర్చి.. ఈరోజు రూ.35,500 పలికింది.

News May 6, 2024

HYD: యూసుఫ్‌గూడ మెట్రోస్టేషన్ కింద MURDER

image

గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని హత్య చేసిన ఘటన HYD జూబ్లీహిల్స్ పీఎస్ పరిధి యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ కింద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తుతెలియని వారొచ్చి మెట్రోస్టేషన్ వద్ద ఉన్న యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. దుండగుల వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే పార్కింగ్ విషయమై హత్య జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

వరంగల్: పత్తి ధర క్వింటా రూ.6,725

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ నేడు ప్రారంభం కాగా పత్తి భారీగా తరలివచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పత్తి ధర పడిపోయింది. శుక్రవారం రూ.6,840 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు రూ.6,725కి పడిపోయింది. ధరలు దారుణంగా పడిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

News May 6, 2024

HYDకు అగ్రనేతలు..!

image

లోక్‌సభ ఎన్నికలకు మరో వారమే సమయం ఉండడంతో రాజధానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే అమిత్‌షా, రేవంత్ రెడ్డి ప్రచారం చేయగా ఈనెల 9న సరూర్‌నగర్‌లో రాహుల్ గాంధీ సభ ఉండనుంది. 10న ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే రానున్నారు. అదే రోజు LB స్టేడియంలో పీఎం మోదీ సభ ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, అన్నామలై ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఈనెల 11న KCR భారీ బహిరంగ సభ ఉండనుందని BRS శ్రేణులు తెలిపాయి.

ఖమ్మం: 8 రోజులపాటు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఈ నెల 7 నుంచి 14 వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు వర్ష సూచన, ఎండ తీవ్రత దృష్ట్యా హమాలీ కార్మికుల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని 8 రోజులపాటు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.