Telangana

News May 6, 2024

పాలమూరులో దంచి కొడుతున్న ఎండలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భగ్గు మంటున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలంతా పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోనే ఈ ఏడాది వంగూరు మండలంలో, కొల్లాపూర్‌లో 46.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం ఇదే మొదటిసారి.

News May 6, 2024

HYD: రోహిత్‌ మరణ నివేదికపై ఎమ్మెల్యే విస్మయం

image

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రోహిత్‌ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘వర్సిటీ వీసీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల కారణంగానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు.

HYD: సీజ్ చేసిన నగదులో రూ.4.27 కోట్లు విడుదల

image

ఆధారాలు సమర్పించడంతో రూ.4,27,98,455 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తున్న ఘటనలపై 153 కేసులు నమోదు కాగా రూ.5,61,02,455 నగదు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే డీజీసీ ఛైర్మన్‌ను సంప్రదించాలన్నారు.

HYD: బెంగళూర్‌‌కు చెందిన సైబర్‌ నేరగాడి అరెస్ట్

image

మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ టెలీగ్రామ్‌ యాప్‌లో ప్రకటనలిచ్చి ఏడుగురి నుంచి రూ.46.19 లక్షలు వసూలు చేసిన బెంగళూర్‌కు చెందిన ఓ సైబర్‌ నేరగాడిని HYD సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా ఏడుగురి నుంచి రూ.46.19 లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత MNC కంపెనీలో ఉద్యోగమంటూ నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు పంపించాడు. నిందితుడు బెంగళూర్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

ములుగు: పిడుగుపాటు.. భార్యాభర్తలకు గాయాలు

image

ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం గ్రామంలో పిడుగు పాటుకు విద్యుత్ స్తంభం కూలి పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఇంటికి మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న భార్యాభర్తలు కంతి చిలకమ్మ, లింగయ్యకు స్వల్ప గాయలయ్యాయి. గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.

News May 6, 2024

భద్రాచలం: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

భద్రాచలంలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృత్యువాత పడ్డారు. సుభాష్ నగర్ కాలనీకి చెందిన 9వ తరగతి విద్యార్థి చింతకాయల సంజయ్ (15) శనివారం సాయంత్రం వడదెబ్బ తగిలి వాంతులు, విరోచనాలు అవ్వడంతో చికిత్స అందిస్తుండగా ఆదివారం మృతి చెందాడు. అలాగే రాజుపేట కాలనీకి చెందిన కే.లక్ష్మయ్య ఎలక్ట్రీషియన్. ఆదివారం పని అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.