Telangana

News May 6, 2024

MDK: రేపు రేవంత్ రెడ్డి జన జాతర సభ

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జన జాతర సభ నిర్వహించనున్నారు. ఈ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు నర్సాపూర్‌లో జరగనున్న ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జన జాతర సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

News May 6, 2024

ఖమ్మం జిల్లాలో ఎగిరేది ఏ జెండా..?

image

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేస్తుంటే.. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ పోటాపోటీగా ప్రచారాలు చేస్తుండడంతో.. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

News May 6, 2024

KMM: గ్రామాల్లో కనిపించని ఎన్నికల సందడి !?

image

ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు, ర్యాలీలూ, సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.

News May 6, 2024

మరో ఆరు రోజులే.. ప్రచారం జోరు ..!

image

MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మం పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.

News May 6, 2024

MBNR: పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం: సీఎం రేవంత్ రెడ్డి

image

గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మనకు సెమీఫైనల్ లాంటివి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రవల్లి జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆ ఎన్నికల్లో BRSను ఓడించి ఇంటికి పంపాము. వచ్చే పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్‌గా సాగుతోంది. ఆ మ్యాచ్‌లో గెలిచి మన సత్తా చాటుకోవాలి. BRS, BJPలు చీకటి ఒప్పందాలు చేసుకొని మనల్ని ఓడించాలని చూస్తున్నాయి’ అని సీఎం అన్నారు.

News May 6, 2024

రేవంత్ రెడ్డి.. నీ బిడ్డ మీద ప్రమాణం చేయ్: నిరంజన్ రెడ్డి

image

రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని, దేవుళ్లపై ప్రమాణం మానుకొని తన బిడ్డ మీద ప్రమాణం చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గుడ్డిగా ఈ రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని సాధించిన మాజీ CM KCRను విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News May 6, 2024

HYD: BRS గెలుపుతోనే దళితులకు మేలు: MRPS స్టేట్ చీఫ్

image

దళితవర్గాల ప్రయోజనమే తెలంగాణ ప్రయోజనంగా భావించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మొదటి నుంచి దళిత వర్గాలకు అన్ని రకాలుగా అండదండలు అందించారని MRPS రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో మాదిగ సామాజిక వర్గం తీరని వేదనకు గురవుతోందని వాపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

News May 6, 2024

HYD: BRS గెలుపుతోనే దళితులకు మేలు: MRPS స్టేట్ చీఫ్

image

దళితవర్గాల ప్రయోజనమే తెలంగాణ ప్రయోజనంగా భావించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మొదటి నుంచి దళిత వర్గాలకు అన్ని రకాలుగా అండదండలు అందించారని MRPS రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో మాదిగ సామాజిక వర్గం తీరని వేదనకు గురవుతోందని వాపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

News May 6, 2024

వరంగల్: నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News May 6, 2024

HYD: సెలవులు ప్రకటించాలని డిమాండ్

image

JNTU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు ఇచ్చిన మాదిరిగానే వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించాలని BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విద్యాశాఖ అధికారులను కోరారు. OUలో ఆయన మాట్లాడారు. తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాలులతో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. స్టూడెంట్స్‌కు ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.