Telangana

News May 6, 2024

రేవంత్ రెడ్డి.. నీ బిడ్డ మీద ప్రమాణం చేయ్: నిరంజన్ రెడ్డి

image

రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని, దేవుళ్లపై ప్రమాణం మానుకొని తన బిడ్డ మీద ప్రమాణం చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గుడ్డిగా ఈ రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని సాధించిన మాజీ CM KCRను విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News May 6, 2024

HYD: BRS గెలుపుతోనే దళితులకు మేలు: MRPS స్టేట్ చీఫ్

image

దళితవర్గాల ప్రయోజనమే తెలంగాణ ప్రయోజనంగా భావించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మొదటి నుంచి దళిత వర్గాలకు అన్ని రకాలుగా అండదండలు అందించారని MRPS రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో మాదిగ సామాజిక వర్గం తీరని వేదనకు గురవుతోందని వాపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్: నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News May 6, 2024

HYD: సెలవులు ప్రకటించాలని డిమాండ్

image

JNTU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు ఇచ్చిన మాదిరిగానే వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించాలని BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విద్యాశాఖ అధికారులను కోరారు. OUలో ఆయన మాట్లాడారు. తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాలులతో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. స్టూడెంట్స్‌కు ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

MBNR, NGKLలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్

image

ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పాగా వేసేందుకు హస్తం పార్టీ దృష్టిని కేంద్రీకరించింది. ప్రతి గ్రామంలో అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో స్పీడ్ పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ రెండు స్థానాల్లో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ఇన్చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలపై మోపింది.

News May 6, 2024

KMR: ఓటర్ ఫెసిలిటీషియన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

కామారెడ్డి ఆర్టీవో కార్యాలయంలోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదివారం సందర్శించారు. పోలింగ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 8 వరకు ఈ కేంద్రం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రఘునాథ్ రావు, తహశీల్దార్ జనార్ధన్, అధికారులు పాల్గొన్నారు.

News May 6, 2024

ADB: ఓటు వేసేవారికి కలెక్టర్ సూచనలు

image

ఓటు వేయడానికి ఈ కింది వాటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్, MNREGA జాబ్ కార్డు, ఫోటోతో ఉన్న పోస్టఫీస్ పాస్‌బుక్, కార్మికశాఖ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, లేబర్ గుర్తింపు కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్, ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, దివ్యంగుల కార్డు, MP, MLA గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలన్నారు.

News May 6, 2024

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు: SP

image

NLG: ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.ఇప్పటికీ వివిధ కేసులలో ఉన్న పాత నేరస్తులను, రౌడీషీటర్స్ ను 512 కేసులలో 943 మందిని బైండోవర్ చేయడం జరిగిందని వెల్లడించారు.జిల్లావ్యాప్తంగా లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుంచి 116 ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు