Telangana

News January 24, 2026

గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలి: అదనపు కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని గోడౌన్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాలో సాంకేతిక ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News January 24, 2026

NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్ శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

News January 24, 2026

NZB: 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 158 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.14,50,000 జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని CP వివరించారు.

News January 24, 2026

ఆదిలాబాద్ జైలు సూపరింటెండెంట్ బదిలీ

image

ఆదిలాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. 2021లో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగున్నరేళ్ల పాటు పారదర్శక సేవలు అందించారు. జైలు ప్రాంగణంలో పెట్రోల్ బంక్, అడ్వాన్స్‌డ్ వెహికల్ వాష్, సోలార్ పార్కింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్‌తో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదని ఆయన పేర్కొన్నారు.

News January 24, 2026

NZB: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం పరిశీలించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయో గమనించి సంబంధిత సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా నగరంలో 3 డివిజన్‌లకు ఒకటి చొప్పున 20 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News January 24, 2026

NZB: ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ విధానం అమలు

image

ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ విధానాన్ని అమలులోకి తెస్తోందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మైనింగ్, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

News January 24, 2026

మహబూబ్‌నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.

News January 24, 2026

NLG: ఎన్నికలకు యంత్రాంగం సర్వం సిద్ధం!

image

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారుల సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని NLG కార్పొరేషన్, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల పుస్తకాలను మున్సిపల్ సిబ్బంది హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.

News January 24, 2026

రేపు ఖమ్మానికి YSRCP అధికార ప్రతినిధి శ్యామల

image

YSRCP రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా నమోదైన కేసుల్లో జైలుకు వెళ్లి, ఇటీవల విడుదలైన పార్టీ కార్యకర్తలను ఆమె పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు నగరంలోని వైఎస్సార్ కాలనీలో బాధితులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి YSRCP శ్రేణులు, జగన్ అభిమానులు తరలిరావాలని పార్టీ ప్రతినిధులు కోరారు.

News January 24, 2026

రైతులకు ఊరట.. జిల్లాకు 1,789 టన్నుల యూరియా

image

ఖమ్మం జిల్లాకు యూరియా నిల్వలు చేరాయి. చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు చేరిన 1,789 టన్నుల యూరియా పంపిణీని టెక్నికల్ ఏవో పవన్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. మొత్తం 3,189 టన్నుల నిల్వల్లో ఖమ్మానికి సింహభాగం కేటాయించగా, మిగిలినవి పొరుగు జిల్లాలకు పంపారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని, పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.