Telangana

News May 6, 2024

వేములవాడ రాజన్న సన్నిధికి ప్రధాని మోదీ

image

వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8న రానున్నారు.ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ప్రధాని రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో ఓ విశేషమేమంటే.. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గతంలో శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిలోని ధర్మకర్తలలో ఒకరుగా ఉన్నారు.

News May 6, 2024

ఈవీఎంల ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు ఉండొద్దు: కలెక్టర్

image

ఈవిఎంల కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవిఎం, వివిప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈక్రమంలో సిబ్బందికి ఆయన‌ సలహాలు సూచనలు చేసారు.

News May 6, 2024

WGL: లోక్‌సభ ఎన్నికలకు సమయం పెంపు: రిటర్నింగ్ అధికారి

image

ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందు వలన పోలింగ్ సమయం పొద్దున్న 7నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుందన్నారు.. ప్రజలు పెంచిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News May 6, 2024

KTR వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకొరాని కిషన్ రెడ్డి ఓట్లు ఎలా అడుగుతారని KTR ప్రశ్నించారు. ఆదివారం రాత్రి రాంనగర్‌ చౌరస్తాలో‌ రోడ్‌ షో‌ నిర్వహించారు. గత 10 ఏళ్లుగా నగరంలో BRS 36 ఫ్లై ఓవర్లు కట్టిందన్నారు. అంబర్‌పేట, ఉప్పల్‌లో BJP మొదలుపెట్టిన ఫ్లై ఓవర్లు నేటికీ పూర్తికాలేదన్నారు. గతంలో వరద బాధితులకు కనీసం సాయం చేయడానికి ముందుకు రాని BJP నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. దీనిపై మీ కామెంట్?

News May 6, 2024

KTR వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకొరాని కిషన్ రెడ్డి ఓట్లు ఎలా అడుగుతారని KTR ప్రశ్నించారు. ఆదివారం రాత్రి రాంనగర్‌ చౌరస్తాలో‌ రోడ్‌ షో‌ నిర్వహించారు. గత 10 ఏళ్లుగా నగరంలో BRS 36 ఫ్లై ఓవర్లు కట్టిందన్నారు. అంబర్‌పేట, ఉప్పల్‌లో BJP మొదలుపెట్టిన ఫ్లై ఓవర్లు నేటికీ పూర్తికాలేదన్నారు. గతంలో వరద బాధితులకు కనీసం సాయం చేయడానికి ముందుకు రాని BJP నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. దీనిపై మీ కామెంట్?

News May 5, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

♥అధికారంలోకి వస్తే కుల గణన చేస్తాం: రాహుల్ గాంధీ
♥MBNR: బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ: చల్లా వంశీ చంద్
♥ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఆగం చేసింది: డీకే అరుణ
♥9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ:CM రేవంత్ రెడ్డి
♥BJPని ఓడించాలి:CPM
♥ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం:కలెక్టర్లు
♥అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి:SPలు
♥ కొడంగల్: కాంగ్రెస్ లో 200 మంది చేరికలు

News May 5, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> అబిడ్స్‌లోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
> కాచిగూడ YMCAలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
> ఉప్పల్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య మంజరి
> కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
> సిద్ధమవుతోన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్
> 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

News May 5, 2024

రిజర్వేషన్లకు ప్రధాని మోదీ వ్యతిరేకం: రాహుల్

image

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ.. పేదల హక్కులను హరించి, ధనికులకు మేలు చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్లు తొలగించడమేనని రాహుల్ వ్యాఖ్యనించారు.

News May 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో మామిడి చెట్టు పైనుండి పడి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో చెరువులో పడి యువకుడి మృతి. @ సుల్తానాబాద్ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం. @ జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్. @ కాటారం మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు. @ హుస్నాబాద్: వడదెబ్బతో ఉపాధ్యాయుడి మృతి.

News May 5, 2024

జిల్లా వ్యాప్తంగా రూ.14.42 కోట్ల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్

image

NLG: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా రూ.14.46 కోట్ల నగదు మద్యం ఆభరణాలు ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎస్పి చందనా దీప్తి వెల్లడించారు.ఓటర్లను ప్రభావితం చేసే నగదు,మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.