Telangana

News May 6, 2024

KTR వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకొరాని కిషన్ రెడ్డి ఓట్లు ఎలా అడుగుతారని KTR ప్రశ్నించారు. ఆదివారం రాత్రి రాంనగర్‌ చౌరస్తాలో‌ రోడ్‌ షో‌ నిర్వహించారు. గత 10 ఏళ్లుగా నగరంలో BRS 36 ఫ్లై ఓవర్లు కట్టిందన్నారు. అంబర్‌పేట, ఉప్పల్‌లో BJP మొదలుపెట్టిన ఫ్లై ఓవర్లు నేటికీ పూర్తికాలేదన్నారు. గతంలో వరద బాధితులకు కనీసం సాయం చేయడానికి ముందుకు రాని BJP నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. దీనిపై మీ కామెంట్?

News May 5, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

♥అధికారంలోకి వస్తే కుల గణన చేస్తాం: రాహుల్ గాంధీ
♥MBNR: బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ: చల్లా వంశీ చంద్
♥ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఆగం చేసింది: డీకే అరుణ
♥9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ:CM రేవంత్ రెడ్డి
♥BJPని ఓడించాలి:CPM
♥ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం:కలెక్టర్లు
♥అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి:SPలు
♥ కొడంగల్: కాంగ్రెస్ లో 200 మంది చేరికలు

News May 5, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> అబిడ్స్‌లోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
> కాచిగూడ YMCAలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
> ఉప్పల్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య మంజరి
> కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
> సిద్ధమవుతోన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్
> 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

News May 5, 2024

రిజర్వేషన్లకు ప్రధాని మోదీ వ్యతిరేకం: రాహుల్

image

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ.. పేదల హక్కులను హరించి, ధనికులకు మేలు చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్లు తొలగించడమేనని రాహుల్ వ్యాఖ్యనించారు.

News May 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో మామిడి చెట్టు పైనుండి పడి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో చెరువులో పడి యువకుడి మృతి. @ సుల్తానాబాద్ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం. @ జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్. @ కాటారం మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు. @ హుస్నాబాద్: వడదెబ్బతో ఉపాధ్యాయుడి మృతి.

News May 5, 2024

జిల్లా వ్యాప్తంగా రూ.14.42 కోట్ల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్

image

NLG: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా రూ.14.46 కోట్ల నగదు మద్యం ఆభరణాలు ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎస్పి చందనా దీప్తి వెల్లడించారు.ఓటర్లను ప్రభావితం చేసే నగదు,మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 5, 2024

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరలు పెరిగాయి: హరీశ్ రావు

image

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరలు అన్ని విపరీతంగా పెరిగిపోయాయని, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి‌తో కలిసి మిరుదొడ్డిలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ తులం బంగారం హామీ ఇవ్వడం ఏమో కానీ తూలం బంగారంకు రూ.20 వేల ధర పెరిగిందని ఎద్దేవా చేశారు. నిత్యావస ధరలు పెరిగాయి అన్నారు.

News May 5, 2024

NLG: పోస్టల్ బ్యాలెట్ కు మూడు రోజులే అవకాశం!

image

పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు గాను కేవలం 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో (6) ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో TODAY టాప్ న్యూస్

image

* > ముగిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తల్లి లచ్చిభాయ్ అంతక్రియలు
* > ములుగు, MHBD, జనగామ జిల్లాల్లో కురిసిన వర్షాలు
* > ఎటునాగారం, రఘునాథపల్లిలో పిడుగు పడి ఇద్దరు మృతి
>* WGL: ముగిసిన నిట్ పరీక్ష.. పలుచోట్ల ఇబ్బందులు
* > మరిపెడలో కాంగ్రెస్ సమావేశం..పాల్గొన్న మంత్రి తుమ్మల
* > MHBD, వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన BSP రాష్ట్ర అధ్యక్షుడు
>* జిల్లాలో విస్తృతంగా కొనసాగిన ఎన్నికల ప్రచారం

News May 5, 2024

గోదావరిఖని: ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన బొడ్డుపల్లి నరేష్ (38) సింగరేణి కార్మికుడు ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్ టౌన్ SIశ్రీనివాస్ తెలిపారు. గత కొంత కాలం నుంచి నరేష్ మానసిక స్థితి బాగాలేక విధులకు హాజరుకావడం లేదన్నారు. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని పగలగొట్టి కుటుంబసభ్యులతో గొడవ పడినట్లు తెలిపారు. ఇదే క్రమంలో పైకప్పు సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నట్లు SIతెలిపారు.