Telangana

News May 5, 2024

KMM: రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.

News May 5, 2024

MBNR: బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ: చల్లా వంశీ చంద్

image

మక్తల్ పట్టణంలో ఆదివారం గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MBNR కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ అన్నారు. ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడే వ్యక్తి కాదన్నారు. గొల్ల కురుమల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News May 5, 2024

జనగామ: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

జనగాం పట్టణంలోని రైల్వేస్టేషన్ ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది. 70 నుంచి 80 ఉండొచ్చు. మృతుడిపై ఆకుపచ్చ రంగు లుంగీ, నిండు చేతుల తెలుపు రంగుచొక్కా వుంది. తెల్లని గడ్డం కలిగి ఉన్నాడు. డెడ్ బాడీని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 5, 2024

MDK: మరో వారం.. ప్రచారం జోరు

image

MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్‌లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో MDK, ZHB పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.

News May 5, 2024

అడ్డగూడూరు: పిడుగుపాటుకు ఒకరి మృతి

image

పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్పలపల్లి బాలమల్లు మేత కోసం పాడి గేదెను తన వ్యవసాయ బావి వద్దకు తోలుకెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో ప్రారంభమై వర్షం పడుతుండడంతో ఊరు ప్రక్కనే ఉన్న తన దొడ్డిలో ఆగగా పిడుగు పడి మృతి చెందాడు.

News May 5, 2024

హైదరాబాద్‌ను యూటీ, లూటీ చేస్తారు: KTR

image

KCR ఉంటేనే నగరం బాగు పడుతుందని ప్రజలు నమ్మి 16 సీట్లు ఇచ్చారని KTR అన్నారు. ఇతర జిల్లాల్లో ప్రజలు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారన్నారు. రూ. 2500, వృద్ధులకు రూ. 4 వేలు, రైతు భరోసా, తులం బంగారం అంటూ అమలుకాని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. కర్మన్‌ఘాట్‌లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న KTR.. BJPకి ఓటు వేస్తే HYDను యూటీ చేస్తారు.. కచ్చితంగా లూటీ చేస్తారని విమర్శించారు.

News May 5, 2024

డీప్ ఫేక్ ఆడియోలు సమాజానికి ముప్పు: మాజీ మంత్రి పువ్వాడ

image

డీప్ ఫేక్ ఆడియోలు సమాజానికి పెను ముప్పుగా మారుతున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. గత కొంతకాలంగా తనపై కూడా అసత్య ప్రచారాలు జరిగినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పువ్వాడ హెచ్చరించారు. దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆయా పార్టీల నాయకుల డీప్ ఫేక్ ఆడియోలు, వీడియోలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.

News May 5, 2024

అక్రమ వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్ సస్పెండ్: ఎస్పీ చందనా

image

అక్రమ వసూళ్లకు పాల్పడిన కేతేపల్లి స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ పి.మహేష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 28న కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వాహనంలో 9 బీర్లు ఉండగా వారిని కేసు నమోదు బెదిరించి చేస్తామని చెప్పి పెట్రోల్ బంకు ద్వారా రూ.6 వేలు ఫోన్ చేయించుకోవడంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

News May 5, 2024

వెల్గటూర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదివారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ లో 47.1°C, ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో లో 46.8°C, రాయికల్ మండలం అల్లీపూర్ లో 46.7°C, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7°C , జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 46.1°C, బీర్పూర్ మండలం కొల్వైలో 46.0°C, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.9°C, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన లో 45.8°C ఉష్ణోగ్రత నమోదైంది.

News May 5, 2024

సికింద్రాబాద్‌లో BJP సభ.. ఆంక్షలు

image

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో BJP సభ కొనసాగుతోంది. మరికాసేపట్లో ప్రాంగణానికి అమిత్ షా రానున్నారు. ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు సభకు చేరుకొన్నారు. భద్రతా చర్యల దృష్ట్యా సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. సంగీత్ X రోడ్‌ నుంచి బేగంపేట, పంజాగుట్ట వెళ్లేవారిని క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌, CTO, రసూల్‌పురా మీదుగా మళ్లిస్తున్నారు. పరేడ్‌ చుట్టూ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. SHARE IT