Telangana

News May 5, 2024

ములుగు: పిడుగుపాటుతో రైతు మృతి

image

ములుగు జిల్లా ఏటూరునాగారంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై రైతు మృత్యువాత పడ్డాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఈ క్రమంలో ఓడవాడ సమీపంలోని మిర్చి కల్లం వద్దకు బరకాలు కప్పేందుకు వెళ్తున్న రైతు బాస బుల్లయ్య పిడుగుపాటుకు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

News May 5, 2024

ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఆగం చేసింది: డీకే అరుణ

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేర్లు చెప్పుకొని తెలంగాణ ప్రజలను ఆగం చేసిందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం ఉర్కొండ మండల పరిధిలోని మాదారం‌లో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రజలను నమ్మించి ముంచినందుకు ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

News May 5, 2024

HSBD: వడదెబ్బతో ఉపాధ్యాయుడి మృతి

image

ఎలక్షన్‌ ట్రైనింగ్‌‌లో వడదెబ్బ తగిలి లకావత్‌ రామన్న (45) అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామన్న హుస్నాబాద్ నుంచి గజ్వేల్‌కు ఎలక్షన్‌ విధులకు వెళ్లాడు. శిక్షణ సమయంలో వడదెబ్బ తగిలింది. డ్యూటీలో సిబ్బంది గజ్వేల్‌ PHCలో అడ్మిట్‌ చేశారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌ MGMకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడని స్థానిక టీచర్లు తెలిపారు.

News May 5, 2024

MBNR: గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

image

గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన జనజాతర సభలో అన్నారు. డీకే అరుణను కాంగ్రెస్సే ఎమ్మెల్యే చేసిందని, పార్టీని అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్లు సంపాదించారని అన్నారు. ఈనెల 9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఆగస్టు 15న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 5 నెలలు కాకుండానే 5గ్యారంటీ పథకాలు అమలు చేశామని, KTR పథకాలు అమలు కావడం లేదనడం విడ్డూరమన్నారు.

News May 5, 2024

నల్లగొండలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

image

నల్లగొండలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు వైర్లు తెగిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

News May 5, 2024

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీ విఫలమైంది : హరీశ్ రావు

image

సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు BRS నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీల హామీ విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీల అమలు చేయనందుకు గానూ రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణ ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు.

News May 5, 2024

NLG: తీవ్ర పని ఒత్తిడిలో అంగన్వాడీలు

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు పని ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం శ్రమకు తగిన వేతనం లభించడం లేదు. చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారు. పని భారం తగ్గించాలని కోరుతున్నారు.

News May 5, 2024

జమ్మికుంట: గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆదర్శకాలనీలో మందకుమార్ ఇంటి వెనుక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇతను రైల్వే స్టేషన్లో, రైల్వే ట్రాక్ వెంబడి కాలి ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ జీవిస్తుంటాడని సమాచారం. ఇతడి స్వగ్రామం, కుటుంబసభ్యుల వివరాలు తెలిసినవారు జమ్మికుంట సీఐ ( 8712670776), జమ్మికుంట ఎస్ఐ (8712574759) నంబర్లకు సమాచారం అందించాలని జమ్మికుంట సీఐ వరంగంటి రవి తెలిపారు.

News May 5, 2024

ఖానాపూర్‌లో ప్రచారం చేసిన ఆత్రం సుగుణ తల్లి

image

ఖానాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఆదివారం ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ఆమె తల్లి కనక బుధవ్వ విస్తృత ప్రచారం నిర్వహించారు. పేదింటి ఆడపడుచును కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎంపి, అభ్యర్థిగా అవకాశం కల్పించిందన్నారు. తన బిడ్డ చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమందికి సేవ చేసిందని.. ఆమెను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు.

News May 5, 2024

SKZR: తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం: అమిత్ షా

image

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్లు తప్పకుండా గెలుస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం సాయంత్రం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల లూటీ జరిగిందని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ, ఖర్గే రాలేదని అన్నారు. వారికి హిందూ సమాజం పై ప్రేమ లేదని ఆరోపించారు.