Telangana

News May 5, 2024

SKZR: తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం: అమిత్ షా

image

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్లు తప్పకుండా గెలుస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం సాయంత్రం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల లూటీ జరిగిందని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ, ఖర్గే రాలేదని అన్నారు. వారికి హిందూ సమాజం పై ప్రేమ లేదని ఆరోపించారు.

News May 5, 2024

NZB: మల్లారం అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య

image

జిల్లాలోని మల్లారం అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంగయ్య (38)గా పోలీసులు గుర్తించారు. గత నెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంగయ్య తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ డిటేల్స్ ఆధారంగా గంగయ్య NZBకు చెందిన వ్యక్తితో మాట్లాడినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.

News May 5, 2024

కామారెడ్డి: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంబదాస్(30) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. భార్య రజిత 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ నిరేశ్ కేసు నమోదు చేశారు.

News May 5, 2024

జిమ్‌ను సందర్శించిన వెంకటేశ్, పొంగులేటి కూతుళ్లు

image

ఖమ్మం ఇల్లందు రోడ్డులో గల ఓ జిమ్‌లో సినీ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత, మంత్రి పొంగులేటి కుమార్తె స్వప్ని రెడ్డి ప్రచారం నిర్వహించారు. సీపీఐ, సీపీఎం బలపరిచిన ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ క్యాంపెయిన్ చేశారు. వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. 

News May 5, 2024

రేపు నిజామాబాద్ జిల్లాకు KCR రాక: వేముల

image

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా BRS అధినేత KCR సోమవారం నిజామాబాద్‌‌కు రానున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా నిర్వహించే రోడ్ షో, భారీ భహిరంగ సభలో KCR పాల్గొంటారని పేర్కొన్నారు.

News May 5, 2024

సీఎం రేవంత్ రెడ్డికి ఆ 4 స్థానాలు ఎంతో కీలకం !

image

సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

News May 5, 2024

NLG: బీర్లు నో స్టాక్.. మద్యం ప్రియులకు నిరాశ

image

భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. దాదాపు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక మద్యం ప్రియులు బీర్లను తాగి ఉపశమనం పొందాలనుకున్నా వారికి నిరాశే కలుగుతుంది.

News May 5, 2024

వరంగల్: మొత్తం 11 నామినేషన్లు

image

వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News May 5, 2024

ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ.. వాహనదారులకు కీలక సూచన

image

ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ నేపథ్యంలో వాహనదారులకు గద్వాల SP రితిరాజ్ పలు సూచనలు చేశారు. గద్వాల నుంచి సభకు వచ్చే వాహనాలు ధన్వంతరి మెడికల్ షాప్ సమీపంలో ఖాళీ వెంచర్‌లో నిలుపుకోవాలన్నారు. షేక్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు వైన్ షాప్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో, కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలు పుల్లారెడ్డి పెట్రోల్ పంపు లెఫ్ట్ సైడ్, బీచుపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు ఏకశిలా స్కూల్ వద్ద పార్కు చేసుకోవాలన్నారు.

News May 5, 2024

Elections: హాట్‌ ఫేవరేట్‌గా సికింద్రాబాద్‌

image

MP ఎన్నికల్లో సికింద్రాబాద్ హాట్ ఫేవరేట్‌గా మారింది. కిషన్ రెడ్డి, పద్మారావు, దానం పోటీలో ఉండటం అంచనాలు పెంచింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ జాతీయ పార్టీలదే హవా. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజాసమితి(1971) గెలిచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా BRS ఖాతా తెరవలేదు. ఈసారి పజ్జన్న‌ నిలబడటంతో‌ టగ్ ఆఫ్ వార్‌‌ అని టాక్. BJP, INC గెలుపుపై ధీమాతో ఉన్నారు. ప్రజానాడీ‌ ఎటువైపనేది ఉత్కంఠగా మారింది.