Telangana

News May 5, 2024

KNR: భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల పురాణిపేటలో జరిగింది. బింగి నవీన్ గోదావరికి చెందిన జ్యోత్స్నతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. భార్య కాపురానికి రానని చెప్పడంతో దీంతో మనస్తాపానికి గురైన శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.

News May 5, 2024

ఆదిలాబాద్: రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.

News May 5, 2024

నల్గొండ: మొత్తం 11 నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News May 5, 2024

MBNR: నేడు నీట్ పరీక్ష.. రూల్స్ ఇవే..

image

నీట్- 2024 పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అధికారుల సూచనలు.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని, ఆభరణాలు కూడా ధరించి రావొద్దన్నారు. హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ మాత్రమే ధరించాలని, బూట్లు కాకుండా స్లిప్పర్లు మాత్రమే వేసుకోవాలి. కేంద్రాల్లో నిర్వాహకులే పెన్నులు ఇస్తారని చెప్పారు.

News May 5, 2024

HYD: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

image

HYD పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌ వద్ద కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమేయడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు.

News May 5, 2024

HYD: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

image

HYD పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌ వద్ద కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమేయడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు.

News May 5, 2024

WGL: బిర్యాని సెంటర్‌లో వెయిటర్ అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యకి మృతి చెందిన ఘటన ఆదివారం నెక్కొండ మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఓ బిర్యాని సెంటర్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న కుమారస్వామి అదే హోటల్‌లో మ‌ృతి చెందాడు. చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వంటిపై గాయాలున్నాయని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News May 5, 2024

నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

image

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో ప్రారంభమవుతుంది. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. ఏర్పాట్లను డీఈవో సోమశేఖరశర్మ, రెండు జిల్లాల కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు పర్యవేక్షిస్తున్నారు.

News May 5, 2024

సిద్దిపేట: సోషల్ మీడియాపై ప్రత్యేక సెల్‌

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో షోషల్ మీడియాపై సిద్దిపేట కమిషనరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో హోం మంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఫేక్ ప్రచారం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఈ టీం పార్టీల నేతలు, కార్యకర్తలు చేసే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, X,యూట్యూబ్‌, రీల్స్‌ వీడియోలు, పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదు చేస్తే చర్యలకు సన్నద్ధమవుతున్నారు.

News May 5, 2024

హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు మొత్తం 1028 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 539 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్దులు 296 మంది, దివ్యాంగులు 243 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో 487 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 228, దివ్యాంగులు 259 మంది ఉన్నారు.