Telangana

News September 12, 2024

మదర్ డెయిరీలో ఆసక్తికర పోరు

image

నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్) ఎన్నికలు తారస్థాయికి చేరాయి. అన్ని కోణాలలో ఆర్థిక స్తోమత, బలం, బలగం ఉన్న ఉన్నత స్థాయి అభ్యర్థులు పోటీ పడుతుండడంతో చివరి నిమిషం వరకు ఎన్నికల ఉత్కంఠగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

News September 12, 2024

గణేశ్ నిమజ్జనం: MDKలో ‘రేపటి కోసం’

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం మెదక్‌లో ఏర్పాట్లు‌ జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత‌ ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం‌ వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.

News September 12, 2024

భూషణరావుపేటలో రైతు ఆత్మహత్యాయత్నం

image

రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కథలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. భూషణరావుపేటకి చెందిన ఏనుగు సాగర్ రెడ్డికి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కాలేదని, ఈ విషయం తోటి రైతులతో చెప్పుకొనే వాడని కుటుంబీకులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News September 12, 2024

MBNR: హైడ్రా EFFECT.. పడిపోయిన స్థిరాస్తి వ్యాపారం!

image

HYD, RR జిల్లాల్లో అనేక భవనాలు హైడ్రా కూల్చివేయటం పట్ల పాలమూరు జిల్లా వ్యాప్తంగా భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గి స్థిరాస్తి వ్యాపారం పడిపోయింది. ఆగస్టులో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 7,315 దస్తావేజులు నమోదు కాగా ప్రభుత్వానికి రూ.19.31 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఆగస్టులో ఉమ్మడి జిల్లాలో 9,007 దస్తావేజులు నమోదు కాగా రూ.22.20 కోట్ల ఆదాయం వచ్చింది.

News September 12, 2024

సూర్యాపేట: కుమారుడిని హత్య చేసిన తండ్రి

image

మద్యానికి బానిసైన కుమారుడు నిత్యం డబ్బుల కోసం వేధిస్తుండడంతో విసుగు చెందిన తండ్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం కొత్తతండా ఆవాసం బాపూజీ తండాలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలిలా.. తండాకు చెందిన కిరణ్ (36) మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం వేధిస్తుండడంతో అతని తండ్రి పంతులు గొడ్డలితో దాడి చేశాడు. కిరణ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు.

News September 12, 2024

MDK: 30 ఏళ్లుగా ఆ ఊరిలో ఒకే దేవుడు..!

image

వినాయక చవితి వచ్చిందంటే గల్లీగల్లీకి విగ్రహం పెట్టి, DJ చప్పుళ్లతో హంగామా చేయడం చూస్తుంటాం. కానీ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్‌లో మాత్రం డిఫరెంట్. ఇక్కడి ప్రజలు మాత్రం కుల, మతాలకు అతీతంగా 30 ఏళ్లుగా గ్రామంలో ఒకే గణపతిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా సంబరాలు చేసుకుంటున్నారు.

News September 12, 2024

HYD సిటీలో రౌడీల భరతం పడతాం: సీపీ

image

HYD సిటీ పోలీస్ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ నేడు మంత్రి సీతక్క, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. HYD నగరంలో రౌడీల భరతం పడతామని, గంజాయి, డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. డ్రగ్స్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 12, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ పర్యటన
> కూనవరంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
> వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
> ప్రశాంతంగా జరుగుతున్న గణేశ్ ఉత్సవాలు
> మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
> తగ్గుముఖం పట్టిన గోదావరి
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

News September 12, 2024

కొండగట్టులో మహిళా కిడ్నాపర్

image

మాల్యాల మండలం కొండగట్టులో బుధవారం ఓ మహిళ బాలుడి అపహరణకు యత్నించింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మూడేళ్ల బాలుడు కిరాణా షాపుకు వెళ్లగా గుర్తు తెలియని మహిళ బాలుడిని పట్టుకుని తీసుకెళ్తోంది. దుకాణ యజమాని గమనించి బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని సదరు మహిళను స్థానికులతో కలిసి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 12, 2024

NLG: 17న ప్రజా పాలన దినోత్సవం

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేసేందుకుగాను ప్రజాప్రతినిధులను ప్రకటించింది. NLG పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి జెండా ఎగురవేస్తారు. SRPTలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, BNGలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.