Telangana

News May 5, 2024

కొత్తగూడెం: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

image

చింతూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఛాతిలో నొప్పి ఉందంటూ ఒక్కసారిగా కుప్ప కూలడంతో తోటి సిబ్బంది వెంటనే రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు శనివారం చింతూరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఏఎస్ఐ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

News May 5, 2024

KMM: తటస్థ ఓటర్లకు పార్టీల గాలం..!

image

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రధానంగా ఖమ్మం జిల్లాపై ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టిసారించారు.

News May 5, 2024

ఎర్రవల్లిలో నేడు జనజాతర.. హాజరుకానున్న రాహుల్, రేవంత్

image

నేడు గద్వాల జిల్లా ఎర్రవల్లిలో జరిగే కాంగ్రెస్‌ జనజాతర సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సాయంత్రం 3.45కి సభా ప్రాంగణానికి రానున్నట్లు సంపత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష మంది జనసమీకరణకు నేతలు ప్లాన్ చేశారు. హైవే సమీపంలో సభ ఉన్నందున వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేయాలని అధికారులకు ఎస్పీ రితిరాజ్ సూచించారు.

News May 5, 2024

MDK: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

image

మెతుకు సీమ భగ భగమంటోంది. రోజురోజుకు భానుడు తాపానికి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జనం జలు హడలిపోతున్నారు. రేగోడ్‌లో శనివారం రికార్డు స్థాయిలో 45.1 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజులుగా ఎండ పెరుగుతూ వచ్చింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిన్న వడదెబ్బతో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే.

News May 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} ఖమ్మంలో నేడు సినీ సంగీత విభావరి
∆} ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
∆} వివిధ శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} వేంసూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి మండలంలో ఎంపీ వద్దిరాజు పర్యటన

News May 5, 2024

మండుతున్న ఎండలు.. ఈత కొడుతూ.. సేద తీరుతూ..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రతి ఒక్కరూ చల్లగా ఉండేందుకు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని స్విమ్మింగ్ పూల్స్, పంట పొలాల్లోని బావుల వద్ద.. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో అక్కడ ఈత కొడుతూ.. చిన్నారుల నుంచి పెద్దల వరకు సేద తీరుతున్నారు.

News May 5, 2024

 BJPకి కర్రు కాల్చి వాత పెట్టాలి: CM

image

మోదీ తెచ్చింది ఏమీ లేదు గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ..”గజ్వేల్‌ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా.. పాలమూరులో కాంగ్రెస్‌ను ఓడించలేరు. పాలమూరు జిల్లాలో బీజేపీ పాతరేయాలి. వంశీని లక్ష మెజార్టీతో గెలిపించాలి’’ అని రేవంత్‌ కోరారు.

News May 5, 2024

KMM: మండే ఎండలో రాజకీయ కాక .!!

image

ఖమ్మం జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే .. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. నియోజకవర్గంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

News May 5, 2024

జోరుగా హుషారుగా ఎన్నికల క్యాంపెయిన్!

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం రోజు రోజుకూ జోరందుకుంటుంది. సమావేశాలు, సభలతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. తమ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు జిల్లాలో వాడవాడనా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే చేయబోయే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు.

News May 5, 2024

మండుతున్న భానుడు.. వర్ని @46.4℃

image

నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వర్ని మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలుగా నమోదైంది. 27 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.