Telangana

News May 5, 2024

 BJPకి కర్రు కాల్చి వాత పెట్టాలి: CM

image

మోదీ తెచ్చింది ఏమీ లేదు గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ..”గజ్వేల్‌ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా.. పాలమూరులో కాంగ్రెస్‌ను ఓడించలేరు. పాలమూరు జిల్లాలో బీజేపీ పాతరేయాలి. వంశీని లక్ష మెజార్టీతో గెలిపించాలి’’ అని రేవంత్‌ కోరారు.

News May 5, 2024

KMM: మండే ఎండలో రాజకీయ కాక .!!

image

ఖమ్మం జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే .. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. నియోజకవర్గంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

News May 5, 2024

జోరుగా హుషారుగా ఎన్నికల క్యాంపెయిన్!

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం రోజు రోజుకూ జోరందుకుంటుంది. సమావేశాలు, సభలతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. తమ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు జిల్లాలో వాడవాడనా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే చేయబోయే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు.

News May 5, 2024

మండుతున్న భానుడు.. వర్ని @46.4℃

image

నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వర్ని మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలుగా నమోదైంది. 27 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News May 5, 2024

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న హోం ఓటింగ్

image

ఖమ్మం జిల్లాలో హోం ఓటింగ్ కొనసాగుతోంది. శనివారం ముదిగొండ మండలంలో 61 మంది, కల్లూరు మండలంలో 19, చింతకాని మండలంలో 79, వేంసూరు మండలంలో 39 మంది ఇంటి దగ్గరే ఓటు వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

News May 5, 2024

నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్ రెడ్డి

image

భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.  నాంపల్లిలో శనివారం రాత్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలతో కలిసి జనగర్జన ర్యాలీ నిర్వహించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.

News May 5, 2024

నేడు నీట్ పరీక్ష.. 5,445 మంది విద్యార్థులు

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్- 2024 పరీక్ష ఆదివారం జరగనుంది. పూర్తిగా ఆఫ్లైన్లో జరగనున్న పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నీట్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజులా దేవి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,445 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 5, 2024

మండుతున్న భానుడు.. వీణవంక @46.5℃

image

కరీంనగర్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వీణవంక మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.5 డిగ్రీలుగా నమోదైంది. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News May 5, 2024

HYD: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

image

HYD నగరంలో రోజు రోజుకూ భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో నమోదైన అత్యధిక 44.3° డిగ్రీల రికార్డు నిన్న బ్రేక్ అయింది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.10 రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఎండలకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.

News May 5, 2024

HYD: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

image

HYD నగరంలో రోజు రోజుకూ భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో నమోదైన అత్యధిక 44.3° డిగ్రీల రికార్డు నిన్న బ్రేక్ అయింది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.10 రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఎండలకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.