Telangana

News May 5, 2024

HYD: మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయండి: సీపీ 

image

మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి కోరారు. షీటీమ్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీటీం అధికారుల నంబర్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్ -8712662602, మల్కాజిగిరి -8712662603, వనస్థలిపురం-8712662604 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News May 5, 2024

PUలో ఓట్ల లెక్కింపు కేంద్రం.. పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, భద్రత ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

News May 5, 2024

HYD: మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయండి: సీపీ

image

మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి కోరారు. షీటీమ్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీటీం అధికారుల నంబర్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్ -8712662602, మల్కాజిగిరి -8712662603, వనస్థలిపురం-8712662604 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News May 5, 2024

సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై నిరంతర నిఘా: ఎస్పీ చందన దీప్తి

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా సోషల్ మీడియాలో పెట్టే వివిధ పోస్ట్‌లపైన నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎవరైన సామాజిక మాధ్యమాల్లో వాట్స్ అప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్‌లో రాజకీయ పార్టీలపై, వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పన్నారు.

News May 5, 2024

HNK: ఓటుహక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ఓటర్లు మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ నుంచి అదాలత్ కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు.

News May 5, 2024

ఈవీఎం యంత్రాల కేటాయింపు పూర్తి: కలెక్టర్ గౌతమ్

image

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం లోక్ సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ కోల్టేతో కలిసి ఈవిఎం యంత్రాల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించినట్లు చెప్పారు.

News May 5, 2024

కరీంనగర్: వీవీ ప్యాట్స్‌లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలి: కలెక్టర్

image

వీవీ ప్యాట్స్‌లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బందిని ఆదేశించారు. శనివారం హుజూరాబాద్‌లోని జూనియర్ కళాశాలలో వీవీ ప్యాట్స్‌లో సింబల్ లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాగ్రత్తలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, తేడాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

News May 4, 2024

HYD: దాహం వేస్తోందని వాటర్ బాటిల్ కొంటున్నారా..? జాగ్రత్త..!

image

వేసవి వేళ దాహం వేస్తోందని, HYDలో స్థానికంగా దొరికిన ఏదో ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసి, దాహం తీర్చుకునే వారిని అధికారులు హెచ్చరించారు. వేసవి డిమాండ్‌ను అదునుగా చేసుకొని కొంతమంది వేల సంఖ్యలో ఫేక్ వాటర్ బాటిల్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే గచ్చిబౌలి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఫేక్ వాటర్ బాటిల్స్ సీజ్ చేశారు. వాటర్ బాటిల్ కొనేటప్పుడు జర జాగ్రత్త..!

HYD: FAKE వాటర్ బాటిల్స్ సీజ్..!

image

HYD నాంపల్లిలోని బిలాల్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఫేక్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక ఎలాంటి లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.