Telangana

News April 3, 2025

ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

image

ఖమ్మం జిల్లాలోని ఈ నెల 5వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

News April 3, 2025

ADB: బెల్ట్ షాపులపై పోలీసుల రైడ్.. నలుగురిపై కేసు

image

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్‌లో కేసు నమోదు  చేసినట్లు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.

News April 3, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News April 3, 2025

కరీంనగర్: వరుస దొంగతనాలు.. జాగ్రత్త..!

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 23 ఆదివారం అర్ధరాత్రి శంకరపట్నం మండలం లింగాపూర్‌లో ఏకంగా 6 ఇళ్లలో దొంగతనాలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి 14న మానకొండూరు జడ్పీహెచ్‌ఎస్‌లో 23 ట్యాబ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News April 3, 2025

వరంగల్: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

image

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసుల తెలిపారు. ఇందులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

News April 3, 2025

GWL: ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

News April 3, 2025

NLG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ITI, డిప్లొమా, NCC కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic. వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

News April 3, 2025

NZB: LRS గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

LRS రిబేట్ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు సూచించారు. అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు.

News April 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

image

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News April 3, 2025

మూసీకి పూడిక ముప్పు..!

image

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.