Telangana

News May 4, 2024

పాలమూరు బిడ్డను సీఎం కుర్చీ నుంచి తిప్పడానికి కుట్రలు: సీఎం

image

పాలమూరు బిడ్డను సీఎం కుర్చీ నుంచి దింపడానికి ఢిల్లీ నుంచి కొంతమంది గొడ్డలితో బయలుదేరారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్తకోటలో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి అభ్యర్థి డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినందుకా కాంగ్రెస్ పార్టీని ఓడించమంటున్నారు ప్రశ్నించారు.

News May 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే:CM రేవంత్ రెడ్డి
✏చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తా:DK అరుణ
✏నర్వ మండల వైద్యాధికారిని సస్సెండ్ చేసిన కలెక్టర్ శ్రీ హర్ష
✏NGKL:ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి!
✏పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✏BJP మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది:కాంగ్రెస్
✏GDWL:బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
✏SSC విద్యార్థులపై ఫోకస్

News May 4, 2024

RR, మేడ్చల్ జిల్లా ప్రజలకు GOOD NEWS

image

గాంధీ, ఉస్మానియా వైద్య సేవలపై ఒత్తిడి తగ్గించేందుకు 100 సీట్ల వైద్య కళాశాలల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు.RRజిల్లా కందుకూరు, మేడ్చల్ జిల్లా చింతల్‌లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వైద్య కళాశాలల విద్యార్థులకు అనుకూలంగా ఉండే ఆసుపత్రులను నిర్ణయించనున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం ఏడాదిన్నరలోపు పూర్తిచేయాలన్నది లక్ష్యం కాగా.. ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించింది.

HYD: ‘పండ్ల నాణ్యతపై అనుమానం వస్తే.. ఇలా చేయండి’

image

HYDలో వేసవి వేళ కెమికల్ రసాయనాలతో కాయలను పండ్లుగా మార్చి విక్రయిస్తున్న వారి పై అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అందిన ఫిర్యాదులపై స్పందిస్తున్నారు. ప్రమాణాలకు విరుద్ధంగా మగ్గబెడితే జస్ట్ వాట్సప్ ద్వారా 9100105795కు ఫొటోలు పంపిస్తే అక్కడికి చేరుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాణ్యతపై అనుమానం వస్తే 040-211111111కు కాల్ చేసి తెలియజేయాలన్నారు.

షాద్‌నగర్‌లో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

షాద్‌నగర్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. కిషన్ నగర్ గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడంతో బైక్ స్కిడ్ అయి అతడు కింద పడినట్లు తెలుస్తోంది.

News May 4, 2024

నాడు ప్రామిసరీ నోట్లు.. నేడు గాడ్ ప్రామిస్‌లు: హరీశ్ రావు

image

మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. అక్బర్ పేట భూంపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నాడు ప్రామిసరీ నోట్లు రాసిచ్చి.. నేడు గాడ్ ప్రామిస్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

News May 4, 2024

HYD: ఎన్నికల వ్యయ పరిశీలకుల నంబర్లు ఇవే..!

image

HYD, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు జనరల్, పోలీస్ వ్యయ పరిశీలకులు జిల్లాకు వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు, ఎవరైనా వివిధ అంశాలపై అధికారులను కలువచ్చని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఏవైనా సమస్యలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు నంబర్లు అందించారు. పై ఫొటోలో చూడవచ్చు.