Telangana

News May 4, 2024

HYD: మండుటెండల్లోనూ చెమటోడుస్తున్న కార్మికులు!

image

నేడు HYD బన్సీలాల్‌పేట్, చిలకలగూడ-44, చార్మినార్, షేక్‌పేట్, ఖైరతాబాద్‌లో-43.8 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిప్పులుగక్కుతున్న మండుటెండల్లోనూ HYD నడిబొడ్డున చార్మినార్, అబిడ్స్, గుల్ మోహర్ బజార్ తదితర ప్రాంతాల్లో కార్మికులు తోపుడుబండ్లపై కొరియర్ సర్వీస్ పనిలో చెమటోడుస్తున్నారు. పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చిన తమకి, ఎండలోనూ పనిచేయక తప్పడం లేదంటూ పలువురు అభిప్రాయపడ్డారు.

HYD: కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

image

ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి KTR పిలుపునిచ్చారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పరిధి అన్నానగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంటోన్మెంట్‌లో నివేదిత, మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. హామీలు అమలు చేయకముందే.. చేసినట్లు మెట్రో పిల్లర్లకు బ్యానర్లు కట్టడం ఏంటని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

ఖమ్మం: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిక్స్.. BJP నుంచి అతనేనా..?

image

NLG -WGL-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

News May 4, 2024

మహబూబాబాద్: పిడుగుపడి యువకుడు మృతి

image

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని లక్ష్మీ పురం గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు పిడుగుపడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న యువకుడు ఒకసారిగా మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 4, 2024

WGL: వృద్ధులు 14,339.. దివ్యాంగులు 30,162

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండో రోజు హోం ఓటింగ్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటింగ్లో పాల్గొంటున్నారు. వరంగల్ లోక్ సభ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 14,339 మంది ఉండగా..దివ్యాంగులు 30,162 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

News May 4, 2024

మినీ ఇండియా.. మల్కాజిగిరిలో గెలుపెవరిది?

image

దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓ మినీ ఇండియా లాంటిది. దాదాపు 40 లక్షల వరకు ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానంలో BRS, కాంగ్రెస్, BJP మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కార్నర్ మీటింగ్స్, గడపగడపకు ప్రచారం, రోడ్డు షోలతో ముందుకు వెళ్తున్నారు. BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతామహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉండగా ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

HYD: మహిళల వైపు కన్నెత్తి చూస్తే.. అంతే సంగతి!

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలు, అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ.. వెంబడించే పోకిరీల భరతం పడతామని షీ టీం పోలీసులు అన్నారు. కేవలం 15 రోజుల్లోనే 133 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారందరికీ కౌన్సిలింగ్ అందించారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మహిళలను వేధించే పోకిరీలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.